- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ ‘స్విగ్గీ’ ప్లాట్‌ఫామ్ ఫీజులు పెంచడంపై నెటిజన్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. గత వారం జొమాటో ₹13.50గా ఉన్న ఫీజును ₹14,90 చేసింది. తాజాగా స్విగ్గీ ₹14.99 నుంచి ₹17.58కి పెంచింది. చమురు ధరలు పెరగడం, ఇంధన కొరతే పెంపునకు కారణంగా తెలుస్తుండగా దీనిపై పలువురు నెటిజన్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కస్టమర్ల జేబులకు చిల్లులు పెట్టేందుకు కంపెనీలు సిద్ధమయ్యాయని అంటున్నారు.
- Advertisement -



