నవతెలంగాణ-రాజన్న సిరిసిల్ల:
సిరిసిల్ల పాస్టర్ ఫెలోషిప్ నూతన కార్యవర్గ ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా జరిగింది. సిరిసిల్ల పట్టణ పరిధిలోని పాస్టర్లందరూ కలిసి ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో సభ్యులందరూ ఏకగ్రీవంగా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన ప్రతినిధులు మాట్లాడుతూ, రానున్న రోజుల్లో క్రైస్తవ సమాజం సర్వతోముఖాభివృద్ధికి, ఐక్యతకు తమ వంతు కృషి చేస్తామని స్పష్టం చేశారు. అనంతరం, దేవుని దీవెనలు, ఆశీర్వాదాలు ప్రజలందరికీ మెండుగా కలగాలని, సమాజంలో శాంతియుత వాతావరణం వర్ధిల్లాలని ఆకాంక్షిస్తూ పాస్టర్లు అందరూ కలిసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.
అధ్యక్షులుగా పాస్టర్ దేవదాస్ సోనా,
ఉపాధ్యక్షులుగా పాస్టర్ సోలోమోను,
కార్యదర్శిగా పాస్టర్ జీవన్ బాబు,
జాయింట్ సెక్రటరిగా పాస్టర్ విజయ్ కుమార్,
కోశాధికారిగా పాస్టర్ జాన్ ఎన్నిక కాగా
కార్యవర్గ సభ్యులుగా పాస్టర్ మోజస్, పాస్టర్ హెజ్కెలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.



