నవతెలంగాణ-రాయికల్: మండలంలోని ఒడ్డెలింగాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం టీబీ ముక్త్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా టీబీపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కస్తూరి సతీష్ మాట్లాడుతూ…టీబీ వ్యాధిగ్రస్తులు కేవలం మందులు మాత్రమే కాకుండా పౌష్టికాహారం కూడా తీసుకోవడం అత్యంత అవసరమని తెలిపారు.పేదరికం కారణంగా చాలామంది సరైన ఆహారం తీసుకోలేకపోవడం వల్ల వ్యాధి తీవ్రత పెరుగుతోందని,టీబీ నిర్మూలన కోసం సమాజంలోని ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా సహకరించాలని పిలుపునిచ్చారు.అనంతరం టీబీ నిర్మూలన ప్రతిజ్ఞ చేయించ.ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్ శ్రీనివాస్,హెల్త్ అసిస్టెంట్ భూమయ్య,ఫార్మసిస్ట్ దీపిక,ల్యాబ్ టెక్నీషియన్ రాజమణి,స్టాఫ్ నర్స్ సుమలతతో పాటు ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.
ఒడ్డెలింగాపూర్ పీహెచ్‌సీలో టీబీపై అవగాహన
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



