Wednesday, March 25, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంప్రభుత్వ ఉద్యోగులకు ఈవీల కొనుగోలుకు ప్రోత్సాహకం

ప్రభుత్వ ఉద్యోగులకు ఈవీల కొనుగోలుకు ప్రోత్సాహకం

- Advertisement -

10-20 శాతం రాయితీ
– కాలుష్య నివారణకే ఉద్యోగులే బ్రాండ్‌ అంబాసిడర్లు : రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌
– సీఎస్‌ రామకష్ణారావు, డీజీపీ శివధర్‌రెడ్డి, కమిసనర్‌ ప్రియాంకతో కలిసి పథకం ప్రారంభం
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌

రాష్ట్ర ప్రభుత్వం పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించడానికి ఈవీ పాలసీ తీసుకొచ్చిందని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ తెలిపారు. రోడ్డు, రిజిస్ట్రేషన్‌ పన్నులను పూర్తిగా 100 శాతం మినహాయింపు ఇస్తున్నామని చెప్పారు. 1.15 లక్షల ఎలక్ట్రిక్‌ వాహనాలకు పైగా రూ. 925.94 కోట్ల ఆదాయం ప్రభుత్వం నష్టపోయి ఎలక్ట్రిక్‌ వాహనాలను ప్రోత్సహిస్తున్నదన్నారు. హైదరాబాద్‌లోని సచివాయంలో ప్రభుత్వ ప్రధానకార్యదర్శి కె. రామకష్ణారావు, డీజీపీ శివధర్‌రెడ్డి, సమాచార శాఖ స్పెషల్‌ కమిషనర్‌ సిహచ్‌. ప్రియాంక, ఉద్యోగ సంఘాల నాయకులతో కలిసి మీడియాతో మాట్లాడారు. పభుత్వ ఉద్యోగులకు 10-20 శాతం మేర డిస్కౌంట్‌ ఇచ్చేలా మహీంద్రా ఎలక్ట్రిక్స్‌, ఆథర్‌ ఎనర్జీ, గ్రావిటన్‌ మోటార్స్‌, ఓలాతో పాటు పలు కంపెనీలు ముందుకు వచ్చాయని మంత్రి వివరించారు. సచివాలయంలోని తెలంగాణ తల్లీ విగ్రహానికి ఎదురుగా ఈవీ వాహానాలను ప్రదర్శించారు. సీఎస్‌, డీజీపీ, ఉద్యోగ సంఘాల నాయకులతో కలిసి మంత్రి వీటిని పరిశీలించారు. వాటి గురించి ఊర్తి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు ఈవీ వాహనాలు ఉపయోగించేలా డిస్కౌంట్‌ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈవీ పాలసీ వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఈవీ వాహనాల వినియోగం 0.60 నుంచి 1.50 శాతం పెరిగిందన్నారు. తెలంగాణ ప్రభుత్వం విద్యుత్‌ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించడానికి సంప్రదాయ ఇంధనాలపై ఆధారపడడం తగ్గించడానికి ప్రభుత్వం విస్త్రృత ప్రయత్నాల్లో బాగంగా ఉద్యోగులకు 10-20 శాతం డిస్కౌంట్‌ వచ్చేలా ఈవీ కంపెనీలతో ఒప్పందం చేసుకుందని చెప్పారు.

రాష్ట్ర ప్రభుత్వం నుంచి కొనే వాహనాలు కూడా ఈవీ వాహనాలు ఉండేలా ఇటీవల జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి సూచించారనీ, అందుకు హైర్‌ పద్ధతిలో లేదా డిపార్ట్మెంట్‌ ల నుంచి వాహనాలు తీసుకునేలా చర్యలు తీసుకుంటామని మంత్రి చెప్పారు. విద్యుత్‌ వాహనాల వినియోగంలో తెలంగాణ నార్వే, చైనాలతో పోటీపడుతున్నదన్నారు. ఈవీలకు ఇబ్బందులు లేకుండా అన్ని ప్రాంతాల్లో ఈవి ఛార్జింగ్‌ స్టేషన్లు ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పారు. క్యూర్‌ ఏరియాలో ఎలక్ట్రిక్‌ బస్సులు నడుస్తున్నాయనీ, అలాగే డీజిల్‌ ఆటోలను కూడా రెట్రోఫిట్‌మెంట్‌గా మార్చి నడపాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదని వివరించారు. రవాణా శాఖలో అనేక సంస్కరణలు తీసుకొచ్చామనీ, స్క్రాప్‌ పాలసీలో భాగంగా 15 సంవత్సరాలు దాటిన వాహనాలు స్క్రాపింగ్‌కి పంపిస్తున్నామని చెప్పారు. తెలంగాణలో వాహన్‌ , సారథి పోర్టల్‌ లోకి చేరిందని వాహనాన్ని కొనుగోలు చేసినప్పుడు షో రూంలోనే రిజిస్టేషన్‌ చేసుకునే అవకాశం ఉంటుందన్నారు.
సీఎస్‌ రామకష్ణరావు మాట్లాడుతూ నగరాన్ని కాలుష్య రహిత రాష్టంగా తీర్చిద్దాలనే లక్ష్యంతో వాహనాలను ప్రభుత్వం తీసుకొస్తున్నదని చెప్పారు. రెండు వేల కిలోమీటర్ల మేరకు క్యూర్‌ చేయాలని ప్రభుత్వం దఢ సంకల్పం తో ప్రణాళిక సిద్ధం చేసిందనీ పేర్కొన్నారు. నగరంలో ఈవీ బస్సులను ఇతర వాహనాలను అందుబాటులోకి తీసుకొస్తున్నామని చెప్పారు. తెలంగాణలో అమలు చేస్తున్న ఈవీ పాలసీ ద్వారా కాలుష్యాన్ని నివారించవచ్చనీ ఆకాంక్షించారు. పెద్ద పెద్ద పట్టణాల్లో ఎయిర్‌ క్వాలిటీ తగ్గుతున్నదని రాష్ట్రంలో 30 శాతం జనాభా హైదరాబాద్‌ లోనే నివసిస్తుందన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -