Wednesday, March 25, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంశ్మశానవాటిక కోసం ధర్నా

శ్మశానవాటిక కోసం ధర్నా

- Advertisement -

రహదారిపై మృతదేహం
నవతెలంగాణ-పెద్దవూర

శవాన్ని పూడ్చడానికి శ్మశానవాటిక లేకపోవడంతో మృతదేహాన్ని రహదారిపై ఉంచి బంధువులు ధర్నా చేసిన ఘటన నల్లగొండ జిల్లా పెద్దవూర మండల కేంద్రంలో మంగళవారం జరిగింది. వివరాల్లోకెళితే.. పెద్దవూర మండల కేంద్రానికి చెందిన అత్యం అన్నపూర్ణ సోమవారం రాత్రి మృతిచెందింది. దహన సంస్కారాలు చేసేందుకు స్థలం లేకపోవడంతో బంధువులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీంతో మంగళవారం హైదరాబాద్‌-నాగార్జునసాగర్‌ ప్రధాన రహదారిపై మృతదేహాన్ని పెట్టి.. ధర్నా చేశారు. శ్మశాన వాటిక ఏర్పాటు చేయాలని ఆర్యవైష్యుల సంఘం ఆధ్వర్యంలో డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. గత ప్రభుత్వం అన్ని గ్రామ పంచాయతీల్లో శ్మశాన వాటికలు ఏర్పాట్లు చేసినా పెద్దవూర మండల కేంద్రంలో చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. శ్మశానవాటిక లేక చాలాకాలం నుంచి మండల కేంద్రంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. పలుమార్లు ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లినా.. శ్మశానవాటికను ఏర్పాటు చేయలేదని చెప్పారు. సంబంధిత అధికారులు, ఎమ్మెల్యే, ప్రజా ప్రతినిధులు వెంటనే శ్మశాన వాటిక ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -