Wednesday, March 25, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంపోడు భూముల్లో కందకం పనులను అడ్డుకున్న గిరిజనులు

పోడు భూముల్లో కందకం పనులను అడ్డుకున్న గిరిజనులు

- Advertisement -

మహిళలపై దాడిచేసిన అటవీ సిబ్బంది
నవతెలంగాణ-సత్తుపల్లి

ఖమ్మం జిల్లా సత్తుపల్లిలోని గుడిపాడు సమీపంలోని పోడు భూముల్లో మంగళవారం అటవీశాఖ సిబ్బంది జేసీబీతో కందకం (ట్రెంచ్‌) తవ్వకం పనులు చేపట్టారు. విషయం తెలిసిన గుడిపాడుకు చెందిన పోడు రైతులు మహిళలు సహా అక్కడికి చేరుకున్నారు. ట్రెంచ్‌ తవ్వకం పనులను అడ్డుకున్నారు. దీంతో ఇరు గ్రూపుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. కొందరు అటవీ సిబ్బంది గిరిజన మహిళలపై దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో మట్టా రంగమ్మ అనే గిరిజన మహిళ చేతికి బలంగా లాఠీ దెబ్బ తగిలింది. రైతులు తెలిపిన వివరాల ప్రకారం..

కాకర్లపల్లి బీట్‌ పరిధిలోని అటవీ ప్రాంతంలో సుమారు 20ఏండ్ల నుంచి 85 ఎకరాల్లో గిరిజనులు పోడు సేద్యం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఆయా భూములకు పట్టాలిస్తామని సర్వే జరిపి 60 ఎకరాలకు మాత్రమే పట్టాలిచ్చింది. మిగతా 25 ఎకరాల భూమికి పట్టాలివ్వకపోవడంతో ప్రతియేటా అటవీ అధికారులకు, గిరిజనుల మధ్య తగాదాలు జరుగుతూ వస్తున్నాయి. ఇదే క్రమంలో మంగళవారం కూడా ఘర్షణకు దారితీసింది. ఈ క్రమంలో ఓ గిరిజన మహిళ చేతికి లాఠీ దెబ్బ తగిలింది. దాడిని సీపీఐ(ఎం) మాస్‌లైన్‌ నాయకులు ఎ.వెంకన్న, అమర్లపూడి శరత్‌ ఖండించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -