Tuesday, August 4, 2026
E-PAPER
Homeతాజా వార్తలుపెళ్లి సందడిలో 'ఇచ్చి పడేద్దాం'

పెళ్లి సందడిలో ‘ఇచ్చి పడేద్దాం’

- Advertisement -

ఇప్పటికే ‘కొత్త సోకు’ పాటతో ప్రేక్షకులను అలరించిన ‘పళ్ళ బురుసు’ టీమ్ తాజాగా మరో ఎనర్జిటిక్ సాంగ్ ‘ఇచ్చి పడేద్దాం’ను విడుదల చేసింది. ఈసారి పెళ్లి వేడుకల సందడిని తెరపైకి తీసుకొస్తూ దావత్, బారాత్ సంబరాలను ఫుల్ జోష్‌లో సెలబ్రేట్ చేసే పాటతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ‘ఇచ్చి ఇచ్చి ఇచ్చి పడేద్దాం…’ అనే క్యాచీ హుక్‌తో ప్రారంభ మయ్యే ఈ పాట మొదటి వినికిడిలోనే ఫెస్టివల్ మూడ్‌ను క్రియేట్ చేస్తుంది. ‘దావత్ అయినా… బారాత్ అయినా…’ అంటూ సాగే సాహిత్యం పెళ్లి వేడుకల్లోని ప్రతి ఆనంద క్షణాన్ని సెలబ్రేట్ చేస్తుంది. ‘ఎవడిది వాడికి ఇచ్చి పడేద్దాం’ అనే రిఫ్రైన్ పాటకు మరింత ఎనర్జీని తీసుకొచ్చి, అందరినీ డ్యాన్స్ ఫ్లోర్‌పైకి తీసుకొచ్చేలా రూపొందింది. మనీషా ఈరబత్తిని, నితేష్ అహేర్ తమ ఎనర్జిటిక్ వోకల్స్‌తో పాటకు మరింత జోష్ తీసుకొచ్చారు. పవన్ సీహెచ్ అందించిన పెప్పీ ట్యూన్, క్యాచీ సాహిత్యం, ఉత్సాహభరితమైన బీట్స్ ఈ పాటను వెంటనే ఆకట్టుకునేలా చేశాయి. విష్ణు అందించిన కోరియోగ్రఫీ పెళ్లి వేడుకల సందడిని అద్భుతంగా ఆవిష్కరించింది. ఈ పాటలోని రిథమ్, ఫెస్టివ్ వైబ్ చూస్తే రాబోయే రోజుల్లో పెళ్లిళ్లు, వేడుకల్లో తప్పకుండా మారుమోగే సాంగ్‌గా నిలిచే అన్ని లక్షణాలు కనిపిస్తున్నాయి. ఈ పాట మాదిరిగానే సినిమా సైతం ఆద్యంతం అన్ని వర్గాల ప్రేక్ష‍కులను అలరిస్తుంది అని చిత్ర బృందం నమ్మకాన్ని వ్యక్తం చేసింది. ఉదయ్ చౌహాన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్, ప్రజ్వల్ యాద్మా, గోమతి రెడ్డి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్, ఎపిక్ స్టూడియోస్ సంయుక్తంగా సమర్పిస్తూ నిర్మిస్తున్న ఈ చిత్రానికి నిర్మాతలు : ఆదిత్య పిట్టీ, వివేక్ కృష్ణాని.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -