నవతెలంగాణ-హైదరాబాద్: దేశరాజధాని ఢిల్లీలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ టూరిస్ట్ స్లీపర్ బస్సు అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు ప్రయాణికులు మృతి చెందగా 23మందికి తీవ్ర గాయాలైయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం సుమారు 30 మంది ప్రయాణికులు ఉన్నారు. మృతులలో ఒకరిని ఉత్తరప్రదేశ్‌లోని ధాంపూర్‌కు చెందిన షెహబాజ్ ఆలం (30)గా అధికారులు గుర్తించారు.రాజస్థాన్‌లోని అల్వార్‌కు చెందిన బస్సు డ్రైవర్ పంకజ్ కుమార్ (26)ను అదుపులోకి తీసుకున్నారు. అతను ప్రస్తుతం లేడీ హార్డింగ్ మెడికల్ కాలేజీలో చికిత్స పొందుతున్నాడు. బుధవారం తెల్లవారుజామున సుమారు 1:05 గంటలకు, జైపూర్ నుండి ఢిల్లీలోని సదర్ బజార్‌లోని ఫతేపురికి వెళ్తున్న యాత్రికుల బస్సు బోల్తా పడిందని, పలువురు ప్రయాణికులు గాయపడ్డారని కరోల్ బాగ్ కరోల్ పోలీస్ స్టేషన్‌కు కాల్ వచ్చింది. కరోల్ బాగ్ ఎస్హెచ్ఓ, రాత్రి గస్తీ బృందం, లింక్ పికెట్ సిబ్బందితో కలిసి వెంటనే ప్రమాద స్థలానికి చేరుకున్నారు. బాధితులను ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
టూరిస్ట్ బస్సు బోల్తా..23మందికి..
- Advertisement -
- Advertisement -



