నవతెలంగాణ – ఉప్పునుంతల : ఉప్పునుంతల తహసీల్దార్ కార్యాలయంలో మండలానికి చెందిన రేషన్ డీలర్ల సమావేశం తహసీల్దార్ అద్దంకి సునీత ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా డీలర్లకు పలు ముఖ్య సూచనలు జారీ చేశారు. ఒకేసారి మూడు నెలల బియ్యాన్ని పంపిణీ చేయాలని, 100 శాతం ఈకేవైసీ పూర్తి చేయాలని ఆదేశించారు.
అలాగే మరణించిన వారు, వివాహం అయిన మహిళల పేర్లను రేషన్ కార్డుల నుంచి తొలగించాలని సూచించారు. డీలర్ల ఆథరైజేషన్ ఈ నెలతో ముగియనున్నందున వెంటనే రెన్యువల్ చేసుకోవాలని చెప్పారు.
ప్రతి గ్రామంలో అధిక ఆదాయం ఉన్న కార్డు హోల్డర్లను గుర్తించి విచారణ చేసి తొలగించాలని, తప్పుగా నమోదు అయిన కొత్త కార్డులను సంబంధిత గ్రామ పంచాయతీలకు మార్చుకోవాలని తహసీల్దార్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది, రేషన్ డీలర్లు పాల్గొన్నారు.



