Wednesday, March 25, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పార్టీ కార్యకర్తలను అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తాం

పార్టీ కార్యకర్తలను అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తాం

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్ : జుక్కల్ మండలం కేంరాజ్ కల్లాలి గ్రామానికి చెందిన బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పిట్ల బాబు గారు వెన్నుపూస శస్త్రచికిత్స చేయించుకుని విజయవంతంగా కోలుకుని ఇంటికి చేరుకోవడం ఆనందకరం అని మాజీ ఎమ్మెల్యే అన్నారు. ఈ సందర్భంగా విషయం తెలుసుకున్న జుక్కల్ మాజీ శాసన సభ్యులు హన్మంత్ షిండే  వారి నివాసానికి వెళ్లి స్వయంగా పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు.
హన్మంత్ షిండే  పిట్ల బాబు  ధైర్యం చెప్పి, త్వరగా పూర్తిగా కోలుకోవాలని ఆకాంక్షించారు. నాయకుడిగా, సహచరుడిగా ఎప్పుడూ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ పరామర్శ కార్యక్రమంలో స్థానిక బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -