Wednesday, March 25, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పెన్షన్ వ్యాలిడేషన్ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలి

పెన్షన్ వ్యాలిడేషన్ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలి

- Advertisement -

– పెన్షనర్ల సంఘం మండల అధ్యక్షులు పాలవరపు సంతోష్
నవతెలంగాణ-తుంగతుర్తి : పదవీ విరమణ పొందిన,ప్రభుత్వ ఉద్యోగులకు నష్టం కలిగించే పెన్షన్ వ్యాలిడేషన్ చట్టం, 2025ను తక్షణమే రద్దు చేయాలని పెన్షనర్ల సంఘం మండల అధ్యక్షులు పాలవరపు సంతోష్ అన్నారు.బుధవారం మండల కేంద్రంలో పెన్షనర్ల సంఘం ఆధ్వర్యంలో మెయిన్ రోడ్డు పై ర్యాలీ నిర్వహించి,తహశీల్దార్ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేసి మాట్లాడారు.ఈ మేరకు పెన్షనర్లకు తీవ్ర నష్టాన్ని కలిగించే పెన్షన్ వ్యాలిడిషన్ చట్టం-2025ను కేంద్రం తక్షణమే రద్దు చేయాలన్నారు.ఈ పెన్షన్ విధానంతో పెన్షనర్లకు తీవ్ర నష్టం కలుగుతుందని అన్నారు.జనవరి ఒకటి 2026 కంటే ముందు ఉద్యోగ విరమణ పొందిన వారిని,ఆ తర్వాత విరమణ పొందిన పెన్షనర్లను వేరువేరుగా విభజించి వేతన సవరణ సంఘం సిఫారసుల ప్రయోజనాలు ఉంటాయని చెప్పడం అనేక అనుమానాలకు దారితీస్తుందన్నారు.ఈ చట్టం పాత,కొత్త పెన్షనర్ల మధ్య వివక్ష చూపుతోందని 8 వ వేతన సంఘం ప్రయోజనాలను నిరాకరిస్తుందని,దీనివల్ల 50 లక్షల మందిపై ప్రభావం పడుతుందని ఆరోపించారు.పాత కొత్త పెన్షనర్లందరికీ సమానంగా పెన్షన్ పెంపు వర్తింపజేయాలని డిమాండ్ చేశారు.పెన్షన్ వ్యవస్థలో తీసుకొస్తున్న మార్పుల వల్ల పెన్షన్ ఉద్యోగులలో గందరగోళాన్ని ఆందోళనను కలిగిస్తున్నాయని అన్నారు.పెండింగ్ డిఏల బకాయిలను వెంటనే విడుదల చేయాలన్నారు.పెన్షనర్లు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలన్నారు.అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని తాసిల్దార్ దయానదంకు అందజేశారు.ఈ ధర్నాకు సంఘీభావంగా బిఆర్ఎస్ మండల అధ్యక్షులు తాటికొండ సీతయ్య,గోపగాని రమేష్ గౌడ్ పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో మండల విశ్రాంత ఉద్యోగుల ప్రధాన కార్యదర్శి పులుసు పుల్లయ్య,కాసం మల్లయ్య,పాలకుర్తి ఎల్లయ్య,ఎండి జాన్,సుధాకర్ రెడ్డి,రవీందర్ రెడ్డి,ఇంద్రసేనారెడ్డి,లక్ష్మారెడ్డి,ఉపేందర్,శ్రీరాములు, మిట్టగడుపుల పురుషోత్తం,తాటి విజయమ్మ, ఖాజా,భాస్కర్,మాధవరావు,మౌలానా,నాగెల్లి లలిత తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -