నవతెలంగాణ – కామారెడ్డి : మున్సిపల్ పరిధిలోని పురాతన కోడూరు గ్రామంలోని పురాతన సనాతన ఆంజనేయస్వామి దేవాలయం భవ్యంగా నిర్మాణం పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా నూతనంగా నిర్మించిన గర్భగుడిలో హనుమంతుని విగ్రహాన్ని బుధవారం ఘనంగా ప్రతిష్ఠించారు.
ప్రఖ్యాత వేద పండితులు బ్రహ్మశ్రీ గంగవరం ఆంజనేయ శర్మ వేదమంత్రోచ్ఛారణల మధ్య దేవాలయ సేవక బృందం హనుమాన్ విగ్రహాన్ని గర్భగుడిలో కొలువు తీర్చింది. ఈ కార్యక్రమం ఆధ్యాత్మిక వాతావరణంలో భక్తిశ్రద్ధలతో నిర్వహించబడింది. రాబోయే శ్రీరామనవమి సందర్భంగా సీతారామ కళ్యాణ మహోత్సవాన్ని, ఏప్రిల్ 2న హనుమజ్జయంతి మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో నిర్వాహకులు నర్సింలు, రమేశ్, శ్రీనివాస్, నరేశ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.



