Wednesday, March 25, 2026
E-PAPER
Homeఖమ్మంవేగంగా ప్రయాణించడం ప్రమాదం..సురక్షితంగా చేరుకోవడమే ప్రమోదం

వేగంగా ప్రయాణించడం ప్రమాదం..సురక్షితంగా చేరుకోవడమే ప్రమోదం

- Advertisement -

– సీఐ నాగరాజు రెడ్డి 
నవతెలంగాణ – అశ్వారావుపేట : వేగంగా ప్రయాణించడం కంటే సురక్షితంగా ఇంటికి చేరుకోవడమే ముఖ్యం అని సీఐ నాగరాజు రెడ్డి అన్నారు. ప్రమాదాల నివారణకు పోలీస్ శాఖ చేపట్టిన ఎరైవ్ – ఎలైవ్ కార్యక్రమంలో భాగంగా బుధవారం స్థానిక పోలీస్ స్టేషన్ సమీపంలో వాహనదారులు ను ఉద్దేశించి ఆయన రహదారి నిబంధనలు పై అవగాహన కల్పించారు.

ఎరైవ్ ఎలైవ్ ఆంగ్ల పదానికి సాధారణంగా “సురక్షితంగా గమ్యానికి చేరుకోండి” లేదా “ప్రాణాలతో సురక్షితంగా చేరండి” అనే అర్థం వస్తుంది అని అన్నారు.రోడ్డు భద్రత – ప్రమాదాల నివారణ ప్రచారాల్లో ఉపయోగించే నినాదం ఇదేనని అన్నారు.

వేగంగా కాకుండా జాగ్రత్తగా వాహనం నడపాలని, వాహనం నడిపే సమయంలో తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని,రహదారి నియమాలు పాటిస్తూ ప్రయాణం చేసినప్పుడు మాత్రమే సురక్షితంగా గమ్యాన్ని చేరుకుంటారని తెలిపారు .ఆయన వెంట ఎస్.హెచ్.ఓ ఎస్ఐ యయాతి రాజు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -