– టీయుజెఎస్ యూ నాయకులు లింగం
నవతెలంగాణ -మిరుదొడ్డి : తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమకారులుగా పనిచేసిన వారందరికీ ఐడి కార్డులు, ఇల్లు, పింఛన్ అందించాలని టియుజెఏయు దుబ్బాక నియోజకవర్గం కన్వీనర్ సూకూరి లింగం అన్నారు. బుధవారం మిరుదొడ్డి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేఖ సమావేశంలో ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులకు పోలీస్ ఉద్యోగులకు వైద్య రంగానికి అనేక రంగాలుగా పనిచేసిన వారిని ప్రభుత్వం గుర్తించి వారికి ప్రభుత్వ అండగా నిలవాలని అన్నారు మల్లన్న సాగర్ ప్రాజెక్టు నిర్మాణం కోసం తెలంగాణ ఉద్యమకారులు ఎంతగానో ప్రాణాలర్పించిన వారిని గుర్తించి వారికి ప్రభుత్వ ఉద్యోగం అందించాలని కోరారు. ఈ ఈ కార్యక్రమంలో టి యు జేయు నాయకులు పల్లాల సత్యనారాయణ రాందేవ్ జ్ఞానేశ్వర్ కోల విజయకుమార్ బలిజ రమేష్ నందిని మల్లయ్య హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ ఉద్యమకారులను గుర్తించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



