Wednesday, March 25, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్విద్యార్థిపై దాడి..సాక్షాలు మాయం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్

విద్యార్థిపై దాడి..సాక్షాలు మాయం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్

- Advertisement -

నవతెలంగాణ-ఆర్మూర్  : పట్టణ కేంద్రలో పీ.డి.ఎస్.యు కార్యాలయంలో బుధవారం డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో పత్రిక విలేకరుల సమావేశం నిర్వహించినారు.. ఈ సందర్బంగా పీ.డి.ఎస్.యు  జిల్లా కార్యదర్శి ప్రిన్స్ మాట్లాడుతు… పెర్కిట్‌లోని ప్రభుత్వ సంక్షేమ BC ఇంటిగ్రాటెడ్ (Boys) , బీసీ (బాయ్స్) పోస్ట్ మాట్రిక్ హాస్టల్ వద్ద 09-03-2026 రాత్రి జరిగిన ఘటనలో, సుమారు 20-25 రౌడీ మూటలు మద్యం సేవించి కత్తులతో హాస్టల్ వద్దకు వచ్చి విద్యార్థులపై దాడి చేయడానికి ప్రయత్నించారని తెలిపారు. ఈ సందర్భంలో పోస్ట్ మ్యాట్రిక్ హాస్టల్ విద్యార్థి నాగుల రాహుల్  మీరు ఎందుకు వచ్చారు అని అడిగినందుకు అకారణంగా దాడికి గురై తీవ్రంగా గాయపడ్డాడు. ఈ దాడిలో అతని కర్ణభేరి (చెవి గుబ) పగిలి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటన సమయంలో హాస్టల్‌లో ఉన్న( HWO) హెచ్ డబ్ల్యు ఓ జైపాల్ విద్యార్థిని రక్షించడానికి ఎటువంటి చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. దాడి జరుగుతున్నప్పటికీ గేటుకి తాళం వేసి తెరవకుండా, సహాయం చేయకుండా ప్రేక్షకుడిలా నిలిచాడు. అంతేకాకుండా, ఘటనను తన మొబైల్‌లో వీడియోగా చిత్రీకరించి, తరువాత వాటిని డిలీట్ చేయడం ద్వారా కీలక సాక్ష్యాలను మాయం ఐయ్యాయి. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, గాయపడిన విద్యార్థిని హాస్పిటల్‌కు తరలించే బాధ్యత కూడా హెచ్ డబ్ల్యు ఓ తీసుకోకుండా, పిడిఎస్యు నాయకులు స్వయంగా ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స ఖర్చులు భరించారు. అలాగే, సంఘటన సమయంలో డయల్-100 కి కాల్ చేయడం కూడా హెచ్ డబ్ల్యు ఓ చేయలేదు, స్థానిక ప్రజలే పోలీసులకు సమాచారం అందించారు. ఈలాంటి వార్డెన్ జైపాల్ ను వెంటనే డిస్మిస్ చేయాలని , ఈ ఘటన జరిగిన తర్వాత అర్చన విద్యార్ధిని కనీసం హాస్పిటల్ కూడా తీసుకు వెళ్లలేదని, వారి తల్లిదండ్రులకు ఫోన్ చేసి మీ కుమారుడు అనవసరంగా గొడవలు పడుతున్నాడని అబద్దాలు చేప్పి విద్యార్ధిని బెదిరిస్తుంది. తన హాస్టల్ విద్యార్థిని రక్షించాల్సిన వార్డెన్ అర్చన విధుల నిర్లక్ష్యం చేసినందుకు వెంటనే ఉద్యోగం నుండి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం.

ఈనెల 17న జిల్లా కలెక్టర్ కి ఫిర్యాదు చేయడం జరిగింది.  వారు వెంటనే ఈ ఘటనపై ఎంక్వయిరీ చేయాలని జిల్లా బీసీ అధికారి నర్సయ్య  చెప్పదం జరిగింది అయితే నిన్న జరిగిన విచారణలో జిల్లా బీసీ సంక్షేమ అధికారి (DBCWO) వైఖరి కూడా అనుమానాస్పదంగా ఉంది. బాధితుడిని ప్రశ్నించే బదులు, బాధ్యతను తప్పించుకునే విధంగా ప్రశ్నలు అడగడం ద్వారా విచారణను వేరే దారి పట్టించే ప్రయత్నం జరుగుతున్నట్లు కనిపిస్తోంది. ఇంకా బాధాకరమైన విషయం ఏమిటంటే, రాహుల్ జైపాల్ సార్ వీడియోస్ తీసి డిలీట్ చేసాడు అని చెప్తే అక్కడఉన్న నర్సయ్య  దానికి నాకు ఎం సంబంధం అని అన్నడం దుర్మార్గం అని అన్నారు.. విచారణ నిజాయితీగా జరగకుండా, తప్పు చేసిన అధికారిని కాపాడుతూ బాధితుడిపైనే ప్రశ్నలు వేయడం ద్వారా మొత్తం విచారణను దారి మళ్లించే పరిస్థితి కనిపిస్తోంది.

ఈ విషయంలో జిల్లా స్థాయి అధికారులు కూడా సమస్య తీవ్రతను పట్టించుకోకుండా విచారణ పేరిట రాహుల్ అనే విద్యార్థిని నువ్వు ఎందుకు బయట ఉన్నావని బెదిరిస్తూ తప్పుడు నివేదికను తయారుచేసి అక్కడ పనిచేస్తున్న వార్డెన్లను రక్షించే విధంగా ప్రయత్నిస్తున్నారు. గతంలో ఇదే హాస్టల్లో సెలవుల్లో ఉన్నటువంటి వార్డెన్ పిల్లలతో పనిచేయించాడని ఆరోపణతో సస్పెండ్ చేశారు. ఆ ఘటనలో కూడా జైపాల్ సార్ విధుల్లో ఉండే కాని ఎలాంటి చర్యలు తీసుకోలేదు.

తప్పుడు నివేదికలను పై అధికారులకు ఇచ్చి, అధికారుల పట్ల గౌరవం కోల్పోయినట్లు అధికారి నర్సయ్య వ్యవహరించారు.  నేడు హాస్టల్ పైకి దాడికి వచ్చి, రాహుల్ విద్యార్థిని కొడుతూ ఉంటే, ప్రేక్షకుడి లాగా వార్డెన్ జైపాల్ చూశాడు తప్ప, తమ హాస్టల్ విద్యార్థి రాహుల్ ని రక్షించడానికి ప్రయత్నం చేయలేదు. అర్చన మేడం కూడా నామమాత్రంగా ఫిర్యాదు చేసి, నిర్లక్ష్యం చేస్తోంది. ఇది ఇక్కడ వార్డెన్ల నిర్వాహకం. వారి నిర్లక్ష్యాన్ని తెలియజేస్తుంది. బాధ్యతారాహిత్యం. ఇలాంటి సంఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా ఉండాలంటే జిల్లా కలెక్టర్ గారు వెంటనే స్పందించి జైపాల్ ను డిస్మిస్ చేయాలి అలాగే అర్చన మేడం ను సస్పెండ్ చేసి, విచారణ అధికారులపై పునర్విచారణ జరపాలని భౌతిక దాడులు చేసిన రౌడీ మూకాల పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. లేనిపక్షంలో పి.డి.ఎస్.యు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని కలెక్టరేట్ ముట్టడి చేస్తామని హెచ్చరిస్తున్నాం. .ఈ కార్యక్రమంలో  డివిజన్ నాయకులు వెంకటేష్, హనుమంత్ రెడ్డి, కైఫ్, అక్షయ్  తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -