Wednesday, March 25, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మథురా తాండాలో వైద్య శిబిరం ఏర్పాటు.

మథురా తాండాలో వైద్య శిబిరం ఏర్పాటు.

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్ : మండలంలోని మథుర తండాలో 99 ఈరోజు ప్రణాళికలో భాగంగా గ్రామ సర్పంచ్ చౌహన్ అనిత మోహన్ బుధవారం నాడు తాండాలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశామని జిపీ కార్యదర్శి స్రవంతి తెలిపారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మరియు జిపి కార్యదర్శి మాట్లాడుతూ ప్రణాళికలు భాగంగా గ్రామంలో ఇప్పటికే పలు కార్యక్రమాలు నిర్వహించామని అన్నారు. తాండవాసులకు చెందిన వారికి ఆరోగ్య పరీక్షలు, బిపి , షుగర్ , వంటి వ్యాధులను గుర్తించి వాటిని మండలం లేదా జిల్లా ఏరియా హాస్పిటల్ కు రిఫర్ చేశామని పేర్కొన్నారు.   ప్రణాళిక లో నిత్యం రోజులలో  గ్రామస్తుల సహకారంతో మహిళలు , గ్రామస్తులు, యువకులతో కలిసి శ్రమదానం చేస్తామని,  తాండాను సుందరంగా తీర్చి దిద్దడమె తమ లక్ష్యం అంటే తెలిపారు . కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ , జీపీ కార్యదర్శి, జిపి పాలకవర్గ సభ్యులు, మహిళలు , గ్రామస్తులు, ఆరోగ్య సిబ్బంది,  తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -