Wednesday, March 25, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మహిళా సంఘ భవనాలకు భూమి పూజ

మహిళా సంఘ భవనాలకు భూమి పూజ

- Advertisement -

నవతెలంగాణ-భిక్కనూర్ : మండలంలోని రామేశ్వర్‌పల్లి, తిప్పాపూర్ గ్రామంలో నూతనంగా మంజూరైన మహిళా సంఘ భవనానికి భూమి పూజ కార్యక్రమానికి టీపీసీసీ జనరల్ సెక్రటరీ బద్దం ఇంద్రకరణ్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు భీమ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంఘాల అభివృద్ధి కొరకు అధిక నిధులు కేటాయిస్తూ సమస్యలు పరిష్కరిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రాజ్ కిరణ్ రెడ్డి, గ్రామ సర్పంచ్ లు చేపూరి రాణి రాజు, లింగారెడ్డి, ఉపసర్పంచ్ వినోద్ గౌడ్, కుమార్, వీడీసీ అధ్యక్షులు మద్ది సూర్యకాంత్ రెడ్డి, ఐకేపీ ఏపీఎం సాయిలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు బాల్ రెడ్డి,శ్రీనివాస్,మోహన్ రెడ్డి, నాగరాజు, పంచాయతీ కార్యదర్శులు శ్యామ్, శ్రీధర్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -