Wednesday, March 25, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పంటల పరిశీలన చేసిన జిల్లా వ్యవసాయ అధికారి

పంటల పరిశీలన చేసిన జిల్లా వ్యవసాయ అధికారి

- Advertisement -

నవతెలంగాణ-భిక్కనూర్ : మండలంలోని కాచాపూర్, పెద్ద మల్లారెడ్డి, లక్ష్మీ దేవునిపల్లి గ్రామాలలో మంగళవారం కురిసిన వడగళ్ల వర్షాల కారణంగా దెబ్బతిన్న వరి, మొక్కజొన్న పంటలను జిల్లా వ్యవసాయ అధికారి మోహన్ రెడ్డి పరిశీలించారు. పంటలను పరిశీలించి రైతుల పరిస్థితి తెలుసుకున్నారు. ప్రాథమిక అంచనా ప్రకారం సుమారు 564 ఎకరాల వరి మరియు 43 ఎకరాల మొక్కజొన్న పంటలు నష్టపోయినట్లు అధికారులు తెలిపారు. ఈ పరిశీలనలో వ్యవసాయ అధికారి నాగరాజు రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచులు, ఎఈఓలు, రైతులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -