Wednesday, March 25, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్వనపర్తిలో హజ్ యాత్రికుల టీకాలు ప్రారంభం

వనపర్తిలో హజ్ యాత్రికుల టీకాలు ప్రారంభం

- Advertisement -

జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి సాయినాథ్ రెడ్డి

33 మందికి పరీక్షలు, వ్యాక్సినేషన్

నవతెలంగాణ వనపర్తి

వనపర్తి జిల్లా కేంద్రంలో హత్యయాత్రికల కోసం టీకాల కార్యక్రమం ప్రారంభమైందని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి సాయినాథ్ రెడ్డి తెలిపారు. 2026–వనపర్తి జిల్లా డ్రగ్ స్టోర్‌లో ఈరోజు హజ్ యాత్రికుల టీకా మరియు వైద్య పరీక్షల కార్యక్రమాన్ని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారికంగా ప్రారంభించింది.

జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ( డి ఎం హెచ్ ఓ ) డాక్టర్ సాయినాథ్ రెడ్డి మరియు జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి ( డి ఐ ఓ) డాక్టర్ పరిమళ ఈ కార్యక్రమాన్ని బుధవారం ఘనంగా ప్రారంభించారు. ఈ శిబిరంలో మొత్తం 33 మంది హజ్ యాత్రికులకు వైద్య పరీక్షలు నిర్వహించి, వారికి అవసరమైన టీకాలను వేశారు. వీరిలో 15 మంది మహిళా యాత్రికులు ఉన్నారు. యాత్రికుల ఆరోగ్య పరిస్థితిని సమీక్షించి, ప్రయాణానికి అవసరమైన ఫిట్‌నెస్ సర్టిఫికేట్లను జారీ చేశారు. నిబంధనల ప్రకారం మెనింజైటిస్ వంటి కీలకమైన వ్యాక్సిన్లను అందించారు. అలాగే హజ్ యాత్రకు వెళ్లే యాత్రికులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, తమ ఆరోగ్య పరీక్షలను సకాలంలో పూర్తి చేసుకోవాలని అధికారులు సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి ( జి జి హెచ్ ) సూపరింటెండెంట్, ఆర్ ఎం ఓ తో పాటు డాక్టర్ ఫయాజ్, డాక్టర్ నాడియా సాదత్, ఎం ఎల్ హెచ్ పి ముజాఫర్, ఎం పి హెచ్ ఈ ఓ జె చంద్రయ్య, సూపర్వైజర్ రజాక్, విసిసిఎం పరశురాముడు, డిడిఎం గిరిజ, డి ఈ ఓ ఎస్ సమీర్, మదన్, ఏఎన్ఎంలు, షాహీన్, నాగేశ్వరి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -