· సంపదను సమకూర్చుకునేందుకు వివిధ రంగాలవ్యాప్తంగా 250 వర్ధమాన కంపెనీల్లో పెట్టుబడులకు అవకాశం
· నిబంధనల ఆధారితమైన, సూచీని ప్రతిఫలించే విధానం కారణంగా ఇన్వెస్టింగ్లో క్రమశిక్షణ
· వైవిధ్యమైన పోర్ట్‌ఫోలియో వల్ల దీర్ఘకాలికంగా వృద్ధిని అందిపుచ్చుకునేందుకు ఆస్కారం
నవతెలంగాణ ముంబై: ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ తమ యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ (యులిప్స్) కింద ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ స్మాల్‌క్యాప్ 250 ఇండెక్స్ ఫండ్‌ని ఆవిష్కరించింది. వర్ధమాన లిస్టెడ్ కంపెనీల విస్తృత శ్రేణిలో ఇన్వెస్ట్ చేసేందుకు, క్రమశిక్షణ, ఇండెక్స్ ఆధారిత విధానంతో దీర్ఘకాలంలో సంపదను పెంపొందించుకునేందుకు కస్టమర్లకు ఈ ఫండ్ తోడ్పడుతుంది.
నిఫ్టీ 500 స్టాక్స్‌లో 251 నుండి 500 వరకు ర్యాంకులు గల 250 కంపెనీలతో కూడుకున్న స్మాల్‌క్యాప్ 250 ఇండెక్స్‌ని ఈ ఫండ్ ట్రాక్ చేస్తుంది. అయితే, ఇండెక్స్‌లో తరచుగా మారే వెయిటేజీని బట్టి అన్ని స్టాక్స్‌లోను కంపెనీ ఇన్వెస్ట్ చేసే విషయంలో నిబంధనలపరమైన పరిమితులు ఉండొచ్చు. ఫలితంగా ట్రాకింగ్ ఎర్రర్ తలెత్తే అవకాశం ఉండొచ్చు. వృద్ధి చెందే క్రమంలో ప్రారంభ దశలో ఉండి, కాలం గడిచే కొద్దీ విస్తరించే సామర్థ్యాలు గల చిన్న లిస్టెడ్ కంపెనీల విస్తృత శ్రేణిలో ఇన్వెస్ట్ చేసేందుకు ఈ ఫండ్ ఉపయోగపడుతుంది.
“వర్ధమాన కంపెనీల వృద్ధి అవకాశాలను అందిపుచ్చుకునేందుకు, దీర్ఘకాలంలో సంపదను పెంపొందించుకునేందుకు స్మాల్‌క్యాప్ 250 ఇండెక్స్ ఫండ్ అనేది కస్టమర్లకు ఒక సరళమైన, పారదర్శకమైన విధానంగా ఉపయోగపడుతుంది. మార్కెట్లో వివిధ రంగాలవ్యాప్తంగా వర్ధమాన కంపెనీల్లో ఇన్వెస్ట్ చేయాలనుకునే దీర్ఘకాలిక ఇన్వెస్టర్లకు ఇది అనువైనదిగా ఉంటుంది.
రూల్స్ ఆధారిత విధానమనేది క్రమశిక్షణతో, బెంచ్‌మార్క్‌కి కట్టుబడి ఉంటూనే విస్తృత శ్రేణి కంపెనీల్లో పెట్టుబడుల డైవర్సిఫికేషన్‌కి అవకాశం కల్పిస్తుంది. ఆర్థిక సేవలు, హెల్త్‌కేర్, క్యాపిటల్ గూడ్స్ తదితర రంగాలవ్యాప్తంగా 250 వర్ధమాన కంపెనీల్లో ఈ ఫండ్ ద్వారా విస్తృతంగా ఇన్వెస్ట్ చేసేందుకు అవకాశం ఉంటుంది. తద్వారా ఒకే ఫండ్ ద్వారా ఎకానమీలోని పలు వర్ధమాన కంపెనీల్లో పెట్టుబడులు పెట్టే వీలుంటుంది” అని ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ మనీష్ కుమార్ తెలిపారు.
దీర్ఘకాలిక వృద్ధి అవకాశాలను సూచిస్తూ, 2026 ఫిబ్రవరి 27నాటికి నిఫ్టీ స్మాల్‌క్యాప్ 250 టీఆర్ఐ ఏడాది కాలవ్యవధికి 15.36%, అయిదేళ్ల వ్యవధికి వార్షిక ప్రాతిపదికన 19.04%, ప్రారంభించినప్పటి నుంచి 15.45% రాబడులను అందించింది. ఈక్విటీ ఆధారిత వ్యూహం కావడం వల్ల మార్కెట్ కదలికలను బట్టి ఫండ్ విలువ హెచ్చుతగ్గులకు లోనవుతుండవచ్చు.
ఈ ఫండ్ ఇండెక్స్‌ని ప్రతిఫలించే ప్యాసివ్ పెట్టుబడి వ్యూహాన్ని పాటిస్తుంది. క్రియాశీలకంగా స్టాక్స్‌ను ఎంపిక చేసుకోవడం కాకుండా బెంచ్‌మార్క్‌కి కట్టుబడి ఉండే లక్ష్యంతో పని చేస్తుంది. నిర్దేశిత మెథడాలజీకి అనుగుణంగా ఉండేలా, పెట్టుబడుల ప్రక్రియ క్రమశిక్షణ,పారదర్శకమైన విధంగా ఉండేలా చూసేందుకు ఇండెక్స్ ఏటా రెండుసార్లు సమీక్షించబడుతుంది.
ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ స్మాల్‌క్యాప్ 250 ఇండెక్స్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ అనేది ఐసీఐసీఐ ప్రు సిగ్నేచర్ అష్యూర్, స్మార్ట్‌కిడ్ అష్యూర్ విత్ ఐసీఐసీఐ ప్రు సిగ్నేచర్ అష్యూర్, ఐసీఐసీఐ ప్రు స్మార్ట్ ఇన్సూరెన్స్ ప్లాన్ ప్లస్ (సిప్+) తదితర లైఫ్ కవరేజీ గల కంపెనీ యులిప్ పాలసీలతో పాటు www.iciciprulife.comలోని ఇతరత్రా యులిప్ పథకాలతో లభిస్తుంది.



