Wednesday, March 25, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అందరి సహకారంతో మున్సిపల్ అభివృద్ధి

అందరి సహకారంతో మున్సిపల్ అభివృద్ధి

- Advertisement -

– మున్సిపల్ చైర్మన్ దండి లక్ష్మి కొమురయ్య 
– కౌన్సిల్ సమావేశంలో 43 పనులకు ఆమోదం 
నవతెలంగాణ హుస్నాబాద్ రూరల్ అందరి సహకారంతో హుస్నాబాద్ పట్టణ అభివృద్ధి చేస్తామని హుస్నాబాద్ మున్సిపల్ చైర్మన్ దండి లక్ష్మి కొమురయ్య అన్నారు. బుధవారం మున్సిపల్ కార్యాలయంలో సాధారణ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. కౌన్సిల్ సమావేశంలో పట్టణంలో కోతుల పట్టుటకు రూ 6 లక్షలు, హుస్నాబాద్ పట్టణంలోని మల్లెచెట్టు చౌరస్తా నుండి ఎల్లమ్మ చెరువు వరకు రోడ్డు డెవలప్మెంట్ ప్లాన్ తయారు చేయుటకు ప్రతిపాదనలు, స్ట్రీట్ లైట్స్ నిర్వహణ పనుల కొరకు రూ10 లక్ష ల రూపాయలు, డి ఆర్ సి సి సెంటర్ వద్ద పొడి చెత్త వేరు చేయుటకు కొత్త షెడ్ నిర్మాణం చేయుటకు రూ:50.00 లక్షలు,రోడ్లు, డ్రైన్లు మరియు కల్వర్డ్లను నిర్వహణ చేయించడం కొరకు రూ: 10.00 లక్షలు, ఎండాకాలం దృష్ట్యా పట్టణములో నీటి కొరత లేకుండా ఉండుటకు నీటి సరఫరా మోటర్లు, స్టాటర్ల మరమ్మతులు చేయుటకు రూ: 10.00 లక్షలు, పట్టణములోని అన్ని కూడళ్ళలో ప్రజలకు వాహనదారులకు స్పష్టమైన మార్గదర్శకత్వం కల్పించు సైన్ బోర్డులు ఏర్పాటు చేయుటతో పాటు పలు అంశాలు పాలకవర్గం ఏకగ్రీవ తీర్మానం చేస్తూ మొత్తం (43) అంశాలకు కౌన్సిల్ ఆమోదిస్తూ తీర్మానించింది. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ చిత్తారి పద్మ, మున్సిపల్ కమిషనర్ తాటి మల్లికార్జున్ గౌడ్, కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -