- Advertisement -
నవతెలంగాణ – కామారెడ్డి : కామారెడ్డి రెవెన్యూ విభాగాధికారి (ఆర్డీవో)గా ఎన్.వై. గిరి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ను మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేశారు. ఇప్పటి వరకు ఆర్డీవోగా విధులు నిర్వహించిన వీణా బదిలీపై ఎండోమెంట్స్ శాఖ భూ పరిరక్షణ విభాగంలో ప్రత్యేక ఉప కలెక్టర్గా నియమితులయ్యారు.
- Advertisement -



