– ఉచిత శిక్షణ..ఉపాధికి బాసట
– స్వయం ఉపాధి శిక్షణను సద్వినియోగం చేసుకోండి : సబ్ కలెక్టర్ కిరణ్మయి
నవతెలంగాణ-నస్రూల్లాబాద్ గ్రామీణ నిరుద్యోగ యువత కోసం ప్రభుత్వం, కెనరా బ్యాంక్ అందిస్తున్న ఉచిత స్వయం ఉపాధి శిక్షణ కేంద్రంను సద్వినియోగం చేసుకోవాలని బాన్సువాడ సబ్ కలెక్టర్ డాక్టర్ కిరణ్మయి సూచించారు. బాన్సువాడ నియోజకవర్గంలోని నసురుల్లాబాద్ మండల కేంద్రంలో గిరిజన యువ శిక్షణ కేంద్రంలో ఏర్పాటుచేసిన శిక్షణ సంస్థను బుధవారం కెనరా బ్యాంక్ జోనల్ కార్యాలయం మేనేజర్ వినోద్ కుమార్, ఎల్ ఎండీ, చంద్ర శేఖర్, డీఆర్డివో అసిస్టెంట్ పీడీ విజయలక్ష్మి కలసి శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు. కామారెడ్డి జిల్లాలోనే స్వయం ఉపాధి శిక్షణ కేంద్రం నసురుల్లాబాద్ మండల కేంద్రంలో ఏర్పాటు చేశారు. అంతకన్న ముందు సబ్ కలెక్టర్ కిరణ్మయి యువత శిక్షణ కేంద్రంలో ఉన్న వసతులను పరిశీలించారు. తరగతి గదులను , విశ్రాంతి గదులను, కార్యాలయంలో ఉన్న సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన సభ లో సబ్ కలెక్టర్ కిరణ్మయి మాట్లాడుతూ నిరుద్యోగులు వారి కాళ్లపై వారు నిలబడేలా శిక్షకులు ప్రత్యేక చొరవ తీసుకోవాలని అన్నారు.నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణను అందించి ఉపాధి కల్పించే దిశగా అనేక చర్యలు తీసుకుంటున్నామన్నారు, కేంద్రం ద్వారా నిరుద్యోగ యువతకు శిక్షణ అందించి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని తెలిపారు. టూ వీలర్ మోటార్ సైకిల్ రిపేరు సెల్ ఫోన్ సర్వీసింగ్ ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ ఎలక్ట్రికల్ హోమ్ వైరింగ్ విళంబింకు సానిటరీ ఎలక్ట్రికల్ మోటార్ రిపేరింగ్ టైలరింగ్ సి సి టీవీ కెమెరా ఇన్స్టాలేషన్ సర్వీసింగ్ కంప్యూటర్ అకౌంటింగ్ తాళి పాడి పరిశ్రమ స్త్రీలకు టైలరింగ్ డ్రెస్ డిజైనింగ్ బ్యూటీ ఫ్లోర్ జ్యూట్ బ్యాక్ తయారీ కూరగాయల బ్యాగ్ తయారీ అగర్బత్తుల తయారీ కొవ్వొత్తుల తయారీ పచ్చళ్ళు మరియు మసాలా పౌడర్ తయారీ పుట్టగొడుగుల పెంపకం పై శిక్షణ తరగతులు ఉంటాయన్నారు. ఈ కేంద్రంలో కనీసం 10 రోజుల నుంచి 30 రోజుల వరకు వివిధ రంగాల్లో శిక్షణ తరగతులు ఉంటాయన్నారు. ప్రభుత్వం అందిస్తున్న శిక్షణను సద్వినియోగం చేసుకొని యువత స్వయం ఉపాధి పొందాలని సూచించారు. కెనరా బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ కేంద్రం ను సద్వినియోగ పరచుకుని ఉపాధి పొందాలని సబ్ కలెక్టర్ సూచించారు. అనంతరం కేంద్రం ముందు చెట్లను నాటారు. శిక్షణ కేంద్రం పక్కనే ఉన్న గిరిజన ఆశ్రమ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య, భోజనం, కనీస సౌకర్యాలు కల్పించాలని సూచించారు. పాఠశాల పనితీరును చూసి ప్రిన్సిపల్ ను అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా డిఆర్డిఏ అసిస్టెంట్ పీడీ విజయలక్ష్మి, ఎంపీడీవో రవి ఈశ్వర్ గౌడ్, కెనరా బ్యాంక్ రీజనల్ మేనేజర్ వినోద్ కుమార్ ఎల్ డి ఎం చంద్రశేఖర్ ప్రిన్సిపాల్ మాధవరావు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పెరిక శ్రీనివాస్ గ్రామ సర్పంచ్ లక్ష్మి శంకర్ నాయక్, రెవెన్యూ ఆర్ ఐ వెంకట్ స్వామి,శిక్షణ కేంద్రం నిర్వాకుడు అమర్ సింగ్, ఐకెపి ఏపీఎం లు సిసిలు, డ్వాక్రా మహిళలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
యువత సొంత కాళ్లపై నిలబడండి..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



