Thursday, March 26, 2026
E-PAPER
Homeకరీంనగర్రాయవరం బస్సు ప్రమాదం…రాయికల్ వలస కార్మికులపై మృత్యుఛాయ

రాయవరం బస్సు ప్రమాదం…రాయికల్ వలస కార్మికులపై మృత్యుఛాయ

- Advertisement -

నవతెలంగాణ-రాయికల్: స్వగ్రామాలకు చేరుకుని కుటుంబ సభ్యులతో కలుసుకోవాలన్న ఆశతో బయలుదేరిన వలస కార్మికుల ప్రయాణం… క్షణాల్లోనే విషాదగాథగా మారింది. ఆంధ్రాలోని మార్కాపురం జిల్లా రాయవరం వద్ద గురువారం జరిగిన ఘోర బస్సు ప్రమాదం రాయికల్,కోరుట్ల ప్రాంతాల్లో విషాదాన్ని నింపింది.

జగిత్యాల జిల్లా నుంచి కూడా ఈ బస్సులో ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. కోరుట్ల నుంచి ఆరుగురు,జగిత్యాల నుంచి ఇద్దరు…మొత్తం జిల్లా నుంచి ఎనిమిది మంది ఈ ప్రమాదంలో చిక్కుకున్నట్లు తెలిసింది. వారి పరిస్థితిపై కుటుంబ సభ్యుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది.

ఈ దుర్ఘటనలో రాయికల్ మండలంలోని రామారావుపల్లె గ్రామంలో స్థిరపడిన ఉప్పు రమాదేవి, రాయికల్ పట్టణంలో పనిచేస్తున్న వెంకటేష్ మంటల్లో కాలిపోయి మృతి చెందినట్లు సమాచారం.కష్టపడి జీవనం సాగిస్తున్న వీరు ఇలా ఆకస్మికంగా ప్రాణాలు కోల్పోవడంతో వారి కుటుంబాలు దిక్కుతోచని స్థితిలో మునిగిపోయాయి.

ఇంకా రత్నమ్మ,కిరణ్ తీవ్రంగా గాయపడగా,మరికొందరు ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. ప్రతి నిమిషం వారి ప్రాణాల కోసం కుటుంబ సభ్యులు ఆందోళనతో వేచి చూస్తున్నారు.ఒకే ప్రమాదం ఎన్నో కుటుంబాలను కన్నీటి మడుగులో ముంచేసింది.స్వగ్రామాలకు చేరుకుని తమవారిని చూడాలన్న ఆశలు బూడిదైపోయాయి… మిగిలింది అంతులేని వేదన మాత్రమే.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -