Thursday, March 26, 2026
E-PAPER
Homeనిజామాబాద్పంటలకు గిట్టుబాటు ధర కల్పించి బోన‌స్ ఇవ్వాలి: సిపిఐ(ఎం)

పంటలకు గిట్టుబాటు ధర కల్పించి బోన‌స్ ఇవ్వాలి: సిపిఐ(ఎం)

- Advertisement -

నవతెలంగాణ-ఆర్మూర్‌: కార్మికులకు, రైతులకి నష్టం కలిగించే విద్యుత్ సవరణ చట్టం, నాలుగు లేబర్ కోడ్స్, వీబీ జీ రాంజీ చట్టం ర‌ద్దు చేయాల‌ని అసెంబ్లీలో ప్రత్యేక తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపాలని సిపిఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు బి ప్రసాద్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాలు రద్దు చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని పట్టణంలో సిపిఐ(ఎం) ఆధ్వర్యంలో పాదయాత్ర రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా తెలంగాణ తల్లి విగ్రహం నుండి సబ్ కలెక్టర్ ఆఫీస్ వరకు గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలో ప్రభుత్వ స్థలాల్లో గుడిసెలు వేసుకుని వాళ్ళందరికీ ఇండ్ల పట్టాలు ఇచ్చి ఇందిరమ్మ ఇల్లు ఐదు లక్షలు సాంక్షన్ చేయాలని అన్నారు సంవత్సరానికి రెండు కోట్ల ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద పట్టణ పేదలకు ఇండ్ల నిర్మాణం చేసి ఇస్తాము అని చెప్పిన మోడీ ప్రభుత్వం ఆర్మూరు పట్టణంలో ఎన్ని ఇండ్లు ఇచ్చిందో బహిరంగ ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు.

నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ పసుపు బోర్డు తెచ్చామని గొప్పలు చెబుతున్నారని కానీ ఈ రోజు వరకు దాని విధివిధానాలు పర్మినెంట్ సిబ్బందిని కేటాయించడంలో ఘోరంగా విఫలం చెందారని అన్నారు జిల్లా అభివృద్ధికి తలమానికంగా ఉన్న నిజాంసాగర్ ఫ్యాక్టరీ ఓపెన్ గురించి విమానాశ్రయం గురించి జిల్లాలో రైతంగం పండించే పంటలకు బోనస్ ఇప్పించటం గురించి పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులు నిర్మాణం చేపట్టడానికి కావలసిన నిధులు తెచ్చేదానిలో ఎంపీ విఫలం అయ్యాడని అన్నారు. స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల ప్రకారం రైతుల పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పిస్తామన్న మోడీ హామీ నీటి మూటలుగానే మిగిలిందని చెప్పారు.

సిపిఐ(ఎం) జిల్లా కార్యదర్శి రమేష్ బాబు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలు రద్దుచేసి లేబర్ కోడ్స్ తేవడం వలన ప్రధానంగా కార్మికులకు పనిగంటలు పెంచి పెట్టుబడిదారులకి అనుకూలంగా ఈరోజు చట్టాలు మార్చడం సిగ్గుచేటని అన్నారు కార్మికులకు ఈఎస్ఐపీఎస్ ఆధ్వర్యంలో కల్పించకుండా కార్మికులను ఎట్టి చాకిరితో చేయించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు అందుకే పెట్టుబడిదారుల లాభాలు తీసుకురావడానికి చట్టాలు మార్పు తీసుకొస్తున్నారని ఆ విధానాన్ని మానుకోవాలని అన్నారు

ఆర్మూర్ ఏరియా పార్టీ కార్యదర్శి వెంకటేష్ మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో నడుస్తున్న ఉపాధి పథకం చట్టం రద్దుచేసి బీవీజీ రాంజీ చట్టం తెచ్చి పేదల పని దెబ్బ కొట్టారని చెప్పారు. 125 రోజులు పని పెంచామని అంటూనే 60 రోజులు పని వ్యవసాయ సీజన్లో బందు పెట్టాలనడం దుర్మార్గం అని చెప్పారు. రైతులు పండించే పసుపు ఎర్ర జొన్నలు మొక్కజొన్నలు మినుములు పెసలు వడ్లు వంటి అన్ని పంటలకు కేంద్ర ప్రభుత్వం బోనస్ ఇవ్వాలని రైతుల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. తెల్ల రేషన్ కార్డు కలిగిన వారందరికీ 14 రకాల నిత్యవసర సరుకులు ఇవ్వాలని కోరారు. జాతీయ గ్రామీణ ఉపాధి చట్టాన్ని కొనసాగించాలని రోజు కూలీ 850 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతాంగానికి నష్టం కలిగించే విద్యుత్ సవరణ చట్టం వల్ల ఎవరికి మేలు జరుగుతుందో కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ ఆలోచించాలని అన్నారు. నేడు రైతులపై భారాలు వేసి పేదలు ఉపయోగించేటటువంటి ఉచిత విద్యుత్ సబ్సిడీ మొత్తం ఎత్తివేసి పెట్టుబడిదారులకి లాభాలు తీసుకురావడానికి విద్యుత్ సవరణ చట్టం అని అన్నారు. ఈ విధానాన్ని సవరించే రైతులకు మేలు జరిగే విధంగా కేంద్రం చూడాలని విద్యుత్ సవరణ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

ఈ పాదయాత్రలో సిపిఐ(ఎం) నాయకులు ఎల్లయ్య భూమన్న సాయిలు రవి సుజాత మస్రప్ బేగం పద్మ రషీదా బేగం రబిక్ రాజన్న తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -