నవతెలంగాణ – జుక్కల్ : మండలంలోని బస్వాపూర్ గ్రామంలో ఎంపీయుపిఎస్ పాఠశాలలో నాలుగవ తరగతిలో అభ్యసిస్తున్న ముగ్గురు విద్యార్థులు శైలజ ,మౌనిక, సంస్కార్ , గురుకులంలో విద్యను అభ్యసించింది సెలెక్ట్ కావడం జరిగిందని పాఠశాల హెచ్ఎం జై చంద్ తెలిపారు. ఈ సందర్భంగా హెచ్ఎం మాట్లాడుతూ పాఠశాలలు చురుకుగా చదువుకొని మందు వరుసలో ఉన్న ముగ్గురు పిల్లలు ఎప్పుడు విద్యలో మొదటి స్థానంలో ఉండేవారని అన్నారు. ముగ్గురు గురుకుల పాఠశాలకు ఎంపిక కావడం వలన గ్రామంలోని పెద్దలు విద్యార్థినీలకు సన్మానించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు , ఉపాధ్యాయుల బృందం తదితరులు పాల్గొన్నారు.
అదేవిధంగా మండలంలోని మహ్మదాబాద్ గ్రామాలలోని ఎపి యూపిఎస్ పాఠశాలలో విద్యనభ్యసిస్తున్న సుఖీ సాక్ పాల్ నాలుగవ తరగతి విద్యార్థిని ఇటీవలే నవోదయ పరీక్షలు రాసి జవహర్ నవోదయ పాఠశాలకు ఎంపిక కావడం జరిగిందని పాఠశాల హెచ్ఎం కాంబినే గోపాల్ తెలిపారు. ఈ సందర్భంగా గిరిజన తాండకు చెందిన అమ్మాయి గురుకుల పాఠశాలకు ఎంపిక కావడం వలన గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేశారు. పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం విద్యార్థినికి మరియు వారి తల్లిదండ్రులకు సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు.




