Thursday, March 26, 2026
E-PAPER
Homeఖమ్మంపంట మార్పిడితో భూసారం పెరుగుదల

పంట మార్పిడితో భూసారం పెరుగుదల

- Advertisement -

– మున్సిపల్ ఛైర్పర్సన్ శశికళ 
– ఉద్యాన సాగు తో దీర్ఘకాలిక ఆదాయం
– సీడీబీ డీడీ మంజునాథ్ రెడ్డి 
– కొబ్బరి సాగు కు ఎరువులు హర్షణీయం 
– రైతు సంఘం నాయకులు పుల్లయ్య 
నవతెలంగాణ – అశ్వారావుపేట : పంట మార్పిడి అంటే ఒకే భూమిలో ఒకే పంటను వరుసగా వేయకుండా, వేర్వేరు పంటలను మారుస్తూ సాగు చేయడం అని,ఈ

పంట మార్పిడితో భూసారాం పెరుగుతుంది అని,పప్పుధాన్యాలు (పెసలు, మినుములు) సాగు చేయడం ద్వారా నేలలో నత్రజని మెరుగు పడుతుంది అని మున్సిపల్ ఛైర్పర్సన్ జూపల్లి శశికళ అన్నారు.

కొబ్బరి అభివృద్ధి మండలి ఆధ్వర్యంలో కొబ్బరి ఆధారిత పంటల విధానం ద్వారా ఉత్పాదకత పెంపు పథకం లో భాగంగా రైతు లకు ఎరువులు అందజేత కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.

కొబ్బరి సాగు దారులు సంఘం బాధ్యులు కొక్కెరపాటి పుల్లయ్య అధ్యక్షతన గురువారం స్థానికంగా ఏర్పాటైన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ పంట మార్పిడితో కీటక వ్యాధులు తగ్గుతాయని,ఒకే పంట వేస్తే వచ్చే కీటకాలు తగ్గుముఖం పడతాయని, ఎరువుల వాడకం తగ్గడంతో ఖర్చు తగ్గుతుంది అన్నారు.సహజంగా నేలలో పోషకాలు పెరుగుతాయని, తద్వారా ఉత్పత్తి పెరుగుతుంది అని,భూమి ఆరోగ్యంగా ఉండటం వల్ల దిగుబడి మెరుగవుతుంది.నీటి వినియోగం సమతుల్యం వేర్వేరు పంటలకు వేర్వేరు నీటి అవసరం ఉంటుంది అన్నారు.

కొబ్బరి అభివృద్ధి మండలి డిప్యూటీ డైరెక్టర్ మంజునాథ్ రెడ్డి మాట్లాడుతూ..  ఉద్యాన సాగు తో లాభాలు అనేకం ఉన్నాయి అని,ఉద్యాన సాగు అంటే పండ్లు, కూరగాయలు, పూలు వంటి పంటల పండించడమేనని తెలిపారు. ఉద్యాన సాగుతో అధిక ఆదాయం తో పాటు, సాధారణ పంటల కంటే ఎక్కువ లాభం వస్తుంది అన్నారు.

అంతే గాకుండా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, ఎక్కువ శ్రమ అవసరం ఉండటం వల్ల పనివారికి ఉపాధి కల్పన, ఉద్యాన పంటలతో పోషకాహారం లభిస్తుందని,పండ్లు, కూరగాయలు ఆరోగ్యానికే గాక ఎగుమతి అవకాశాలు ఉండి మామిడి, ద్రాక్ష వంటి పండ్లు విదేశాలకు ఎగుమతి అవడంతో విదేశీ మారక ద్రవ్యం పెరిగే అవకాశం ఉందని తెలిపారు. తక్కువ భూమిలో ఎక్కువ లాభం వచ్చేలా సాగు చేయవచ్చు అన్నారు.

రైతు సంఘం నాయకులు కే.పుల్లయ్య మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటు అయ్యాక ఇన్నేళ్ళు కు కొబ్బరి అభివృద్ధి మండలి నుండి ఇక్కడి కొబ్బరి రైతులకు ఎరువులు అందడం ఇదే మొదటిసారి కావడం ఎంతో ఆనందంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో కొబ్బరి అభివృద్ధి మండలి వేగివాడ కొబ్బరి నర్సరీ డైరెక్టర్,సీనియర్ సైంటిస్ట్ రఘోత్తం,డీఓ శరత్, ఉద్యాన శాఖ విస్తరణాధికారి ఈశ్వర్,రైతు సంఘం నాయకులు తుంబురు ఉమా మహేశ్వర రెడ్డి,తలసిల ప్రసాద్, శీమకుర్తి వెంకటేశ్వరరావు, కాసాని పద్మశేఖర్,తాడేపల్లి రవి,ప్రమోద్,కానూరి మోహన్ రావు లు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -