Thursday, March 26, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కోనాపూర్ గ్రామం బీజేపీ, బిఆర్ఎస్, నాయకులు కాంగ్రెస్ లో చేరిక

కోనాపూర్ గ్రామం బీజేపీ, బిఆర్ఎస్, నాయకులు కాంగ్రెస్ లో చేరిక

- Advertisement -

నవతెలంగాణ- కామారెడ్డి : కామారెడ్డి నియోజకవర్గ కేంద్రంలోని బిబిపేట్ మండల్ కోనాపూర్ గ్రామానికి చెందిన చెందిన బీజేపీ, బిఆర్ఎస్, నాయకులు ఆ పార్టీనీ విడి గురువారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి  ఆధ్వర్యంలో బీజేపీ, బిఆర్ఎస్, యువకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల పట్ల ఆకర్షితులై బీజేపీ, బిఆర్ఎస్,పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. జడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ పార్టీ యువకులు, రేవంత్ రెడ్డి  పాలన బాగుందని అది చూసి మేం పార్టీలో జాయిన్ అవుతున్నామని తెలిపారు.      టిపీసీసీ స్టేట్ జనరల్ సెక్రెటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ రాబోయే ఎంపిటిసి, జడ్పిటిసి ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలుపించుకోనేలా కృషి చేయాలనీ కోరారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి పనులను ప్రజల్లోకి తీసుక వెళ్లాలని అకాంక్షించారు. కాంగ్రెస్ పథకాలు, అభివృద్ధి పనులు తదితర వాటిని గమనించి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగిందన్నారు .ఈ కార్యక్రమంలో కామారెడ్డి పట్టణ కౌన్సిలర్లు, గడ్డమీది మహేష్, కాంగ్రెస్ నాయకులు, సాయిబాబా, అరుణ్ గౌడ్,పార్టీలో చేరిన వాళ్లు, సిహెచ్ ప్రదీప్ గౌడ్, స్వామి, రాజు, జి స్వామి, శల్వి గౌడ్, కే స్వామి తదితరులు ఉన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -