నవతెలంగాణ-భువనగిరి: తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ విద్యుత్ ఆర్టీజియన్స్ ఎంప్లాయిస్ జేఏసీ ఆధ్వర్యంలో.. గురువారం విద్యుత్ డివిజన్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు విద్యుత్ ఉద్యోగ సంఘాలు 1104, 327, టిఆర్‌వికెఎస్, బీసీ అసోసియేషన్, ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ సంఘాలు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న ఆర్టిజన్ కార్మికులకు ఏపీఎస్సిబి సర్వీస్ రూల్స్ అమలు చేయాలన్నారు. మిగిలిపోయిన అన్మాండ్ కార్మికులు, సొసైటీ కార్మికులను ఆర్టిజన్‌గా గుర్తించాలన్నారు. పిసు రేటు కార్మికులు ప్రవేట్ కలెక్షన్ ఏజెంట్లు, ప్రైవేట్ మీటర్ రీడర్లు, ఎస్పీఎం కార్మికులు, హమాలీలు, కార్మికులకు జీవో నెంబర్ 11 ప్రకారం కనీస వేతనం అమలు చేయాలన్నారు.
2026 పీఆర్సీ కమిటీని వేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టిజిఎస్పీడీసీఎల్ కంపెనీ కో చైర్మన్ బొక్క పాండరీ రెడ్డి, ఉమ్మడి జిల్లాకు చైర్మన్ భాస్కర్ నాయక్, భువనగిరి డివిజన్ చైర్మన్ ఇంజ మహేష్, కో చైర్మన్ ఎడ్ల వెంకటేశు, కన్వీనర్ బోట్ల రమేష్,కో కన్వీనర్ హరికృష్ణ,సాగిన రమేష్, భువనగిరి సబ్ డివిజన్, బింగి శ్రీకాంత్ దాతరపు భాస్కర్, వైస్ చైర్మన్ బొట్ల నర్సింగరావు, బండ రవి, కోశాధికారి హేమలత,మహిళ ప్రతినిధి మహేశ్వరి, కార్యనిర్వాహక కార్యదర్శి అమరేందర్, ఈదయ్య,బాలకృష్ణ సంయుక్త కార్యదర్శి భాస్కర్, శోభన్ బాబు, మల్లేష్ తదితర కార్మిక నాయకులు పాల్గొన్నారు..



