- చౌటుప్పల్ ట్రాఫిక్ సబ్ ఇన్స్పెక్టర్ ఆంజనేయులు
నవతెలంగాణ-చౌటుప్పల్ రూరల్: చౌటుప్పల్ మున్సిపాలిటీ ట్రినిటీ హైస్కూల్లో ట్రాఫిక్ నియమాలపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు గురువారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చౌటుప్పల్ ట్రాఫిక్ సబ్ ఇన్స్పెక్టర్ ఆంజనేయులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 21 సంవత్సరాలు దాటిన వారు తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్ పొందాలని సూచించారు. లైసెన్స్ లేకుండా వాహనాలు నడపకూడదని,ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించాలని విద్యార్థులకు తెలిపారు.రోడ్డు దాటేటప్పుడు కేవలం సిగ్నల్ ఉన్న చోట్లే దాటాలని సూచించారు. అలాగే,బైక్‌పై ప్రయాణించే సమయంలో తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, ఈ విషయాన్ని విద్యార్థులు తమ తల్లిదండ్రులకు కూడా తెలియజేయాలని అన్నారు.ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఏఎస్ఐ సైదిరెడ్డి, స్కూల్ చైర్మన్ కేవీబీ కృష్ణారావు, ప్రిన్సిపాల్ ఉజ్జిని మంజుల,ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.



