Thursday, March 26, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ అధ్యక్షతన డిసిసి, డిఎల్ఆర్సి  సమావేశం 

జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ అధ్యక్షతన డిసిసి, డిఎల్ఆర్సి  సమావేశం 

- Advertisement -

నవతెలంగాణ –  కామారెడ్డి : కామారెడ్డి జిల్లాలో బ్యాంకింగ్ సేవలు, అభివృద్ధి కార్యక్రమాల పురోగతిని సమీక్షించేందుకు జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ అధ్యక్షతన గురువారం మినీ సమావేశ మందిరంలో డిసెంబర్ 2025 త్రైమాసికానికి సంబంధించిన డిసిసి, డిఎల్ఆర్సి సమావేశం నిర్వహించబడింది. ఈ సమావేశంలో వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, బ్యాంకుల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలు పరిస్థితిని సమీక్షించారు. 30.12.2025 న జరిగిన సమావేశంలో ఆమోదించబడిన అంశాలపై తీసుకున్న చర్యల నివేదికను పరిశీలించి, పలు రంగాల్లో పురోగతి నమోదైనట్లు గుర్తించారు. వ్యవసాయ రంగంలో పంట రుణాలు, టర్మ్ రుణాలు, మౌలిక సదుపాయాల రుణాల మంజూరు, పునరుద్ధరణ ప్రక్రియను వేగవంతం చేయాలని బ్యాంకులకు సూచించారు. ఎంఎస్ఎంఈ రంగంలో పెండింగ్ దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించి రుణాల మంజూరులో మెరుగుదల సాధించాలని తెలిపారు. స్వయం సహాయక బృందాల (SHG) బ్యాంక్ అనుసంధానం కింద ఎం సి పి (  MCP ) ల అమలు పురోగతిని సమీక్షించి, ఎస్ హెచ్ జి  రుణాల కింద ఉన్న ఎన్పీఏ  ఖాతాల రికవరీ కోసం సంయుక్త చర్యలు చేపట్టాలని సూచించారు. ఎస్సీ ,ఎస్టీ  కార్పొరేషన్ల పథకాల కింద యూనిట్ల స్థాపనలో పెండింగ్‌లో ఉన్న లక్ష్యాలను త్వరగా పూర్తి చేయాలని పేర్కొన్నారు. మత్స్య, పశుసంవర్ధక రంగాలకు సంబంధించిన కె సి సి  రుణ దరఖాస్తులను ప్రాధాన్యతతో పరిష్కరించాలని సూచించారు. అలాగే డిసిసి, డిఎల్ఆర్సి సమావేశాలకు బ్యాంక్ కంట్రోలర్ల హాజరు తప్పనిసరి అని స్పష్టం చేశారు.

వార్షిక రుణ ప్రణాళిక 2025 – 26 లక్ష్యాలను చేరుకోవడానికి బ్యాంకులు మరింత కృషి చేయాలని, ప్రాధాన్యతా రంగాలకు రుణ ప్రవాహాన్ని పెంచాలని, పెండింగ్ దరఖాస్తులు ఎన్ పి ఏ   ఖాతాల పరిష్కారాన్ని వేగవంతం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. బ్యాంకులు తమ డేటాను సకాలంలో సమర్పించాలని  సూచించారు. అన్ని శాఖలు, బ్యాంకులు సమన్వయంతో పనిచేసి జిల్లాలో ఆర్థికాభివృద్ధిని బలోపేతం చేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.

ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ మధు మోహన్, లీడ్ బ్యాంక్ మేనేజర్ చంద్రశేఖర్, వివిధ బ్యాంకుల బ్రాంచ్ మేనేజర్లు, సంబంధిత శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -