– ముగింపు కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్
నవతెలంగాణ – కామారెడ్డి : సెన్సస్ – 2027లో భాగంగా నిర్వహించనున్న దశ – 1 గృహ జాబితా, గృహ గణన (HLO) కార్యక్రమానికి సంబంధించి కలెక్టరేట్ సమావేశ మందిరంలో గురువారం జరిగిన శిక్షణ ముగింపు కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పలు సూచనలు, సలహాలు అందించారు. ఛార్జ్ క్లర్కులు, టెక్నికల్ అసిస్టెంట్లకు నిర్వహించిన శిక్షణలో అదనపు కలెక్టర్ విక్టర్‌తో కలిసి జిల్లా కలెక్టర్ పాల్గొని మార్గనిర్దేశం చేశారు. 2026 మే 11 నుండి గృహ జాబితా, గృహ గణన కార్యక్రమం ప్రారంభం కానున్న నేపథ్యంలో ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లకు సమగ్ర శిక్షణ ఇవ్వబడుతున్నదని తెలిపారు. గత మూడు రోజులుగా జిల్లా , ఉపజిల్లా అధికారులు, ఛార్జ్ అధికారులు, ఛార్జ్ క్లర్కులు, టెక్నికల్ అసిస్టెంట్లు, ఫీల్డ్ ట్రైనర్లకు విస్తృతంగా అవగాహన కల్పించినట్లు పేర్కొన్నారు. సెన్సస్ పనుల్లో ప్రతి అధికారి పూర్తి అవగాహన కలిగి ఉండాలని, ముఖ్యంగా యాప్‌ల వినియోగం, గృహ గణనలో ఉండే 34 ప్రశ్నలపై స్పష్టమైన అవగాహన అవసరమని జిల్లా కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో సీపీవో రఘునందన్ తదితరులు పాల్గొన్నారు.
గృహ జాబితా, గృహ గణనపై శిక్షణ ముగింపు కార్యక్రమం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



