Thursday, March 26, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్వడగండ్ల వానతో పంటల నాశనం..రైతులకు భరోసా ఇచ్చిన షబ్బీర్ అలీ

వడగండ్ల వానతో పంటల నాశనం..రైతులకు భరోసా ఇచ్చిన షబ్బీర్ అలీ

- Advertisement -

నవతెలంగాణ-భిక్కనూర్ : మండలంలోని పెద్ద మల్లారెడ్డి, కంచర్ల గ్రామాలలో ఇటీవల కురిసిన వడగండ్ల వాన రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. పెద్ద మల్లారెడ్డి చెరువు కింద సుమారు వెయ్యి ఎకరాల్లో సాగు చేసిన వరి పంట పూర్తిగా నష్టపోయింది. అదేవిధంగా మామిడి, మొక్కజొన్న, కూరగాయల పంటలు కూడా భారీగా దెబ్బతిన్నాయి. విషయం తెలుసుకున్న ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ అలీ వెంటనే స్పందించి ప్రభావిత గ్రామాల్లో గురువారం పర్యటించారు. పంటల పరిస్థితిని ప్రత్యక్షంగా పరిశీలించి రైతులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బాధిత రైతులకు ధైర్యం చెబుతూ ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం అందిస్తామని భరోసా ఇచ్చారు.
తదుపరి వ్యవసాయ, రెవెన్యూ అధికారులతో సమావేశమై తక్షణమే పంట నష్టం సర్వే చేపట్టి సమగ్ర నివేదిక సిద్ధం చేయాలని ఆదేశించారు. రైతులకు న్యాయం జరిగేలా వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించారు.
నివేదిక అందిన వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాట్లాడి రైతులకు తగిన నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకుంటానని తెలిపారు. రైతుల కష్టాన్ని ప్రభుత్వం గుర్తించి వారికి పూర్తి మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. రైతుల కష్టకాలంలో ప్రభుత్వం వారి వెంటే ఉంటుందని, ప్రతి రైతుకు న్యాయం జరిగేలా వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తానని అన్నారు. నష్టపోయిన ప్రతి ఎకరాకు సరైన పరిహారం అందేలా కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పిసిసి జనరల్ సెక్రటరీ ఇంద్రకరణ్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ చంద్రకాంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు భీమ్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి రాజాబాబు గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ పాత రాజు, మాజి ఎంపిపి గాల్ రెడ్డి, మాజి సొసైటీ చైర్మన్ రాజా గౌడ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -