Thursday, March 26, 2026
E-PAPER
Homeజిల్లాలుభువనగిరిలో వీధి కుక్కల స్వైరవిహారం

భువనగిరిలో వీధి కుక్కల స్వైరవిహారం

- Advertisement -
  • వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ఈ దాడుల్లో ముగ్గురు చిన్నారులకు తీవ్రంగా గాయాలు.
  • కన్ను కోల్పోయిన నాలుగేళ్ల చిన్నారి


నవతెలంగాణ-భువనగిరి: భువనగిరి పట్టణంలో వీధి కుక్కలు మరోసారి పంజా విసిరాయి. వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ఈ దాడుల్లో ముగ్గురు చిన్నారులు తీవ్రంగా గాయపడగా, ఒక బాలుడి పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా మారింది.

తారకరామ నగర్‌లో విషాదం
తారకరామ నగర్‌కు చెందిన డ్రైవర్‌ సందెల రాహుల్‌ కుమారుడు ప్రియాంష్‌ (4) ఇంటి బయట ఆడుకుంటుండగా, ఒక్కసారిగా వీధి కుక్కలు దాడి చేశాయి. ఈ దాడి ఎంత భీభత్సంగా జరిగిందంటే.. కుక్కలు చిన్నారి ముఖంపై తీవ్రంగా గాయపరచడమే కాకుండా, కనుగుడ్డును పీకి పక్కన పడేశాయి. తీవ్ర రక్తస్రావంతో అల్లాడిపోతున్న చిన్నారిని గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం, పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు. ప్రస్తుతం చిన్నారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

ఆర్‌.బి నగర్‌లో ఇద్దరు విద్యార్థులకు గాయాలు
మరో ఘటనలో, ఆర్‌.బి నగర్‌లో వీధి కుక్కలు హల్‌చల్‌ సష్టించాయి. వీధిలో వెళ్తున్న కమల్‌ కుమారుడు అగర్వాల్‌తో పాటు, అదే వీధికి చెందిన శంకర్‌ కుమారుడు తన్విష్‌పై కుక్కలు దాడి చేశాయి. ఈ దాడిలో వారిద్దరికీ కాళ్లపై తీవ్ర గాయాలయ్యాయి. బాధితులు స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

ప్రజల ఆందోళన
పట్టణంలో వరుసగా జరుగుతున్న కుక్కల దాడులతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. పిల్లలను బయటకు పంపాలంటేనే భయపడాల్సిన పరిస్థితి ఏర్పడిందని వాపోతున్నారు. మున్సిపల్‌ అధికారులు తక్షణమే స్పందించి వీధి కుక్కల బెడద నుండి తమను కాపాడాలని బాధ్యులు కోరుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -