నవతెలంగాణ – రాయపోల్ : జాతీయ లోక్ అదాలత్‌ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని రాయపోల్ ఎస్ఐ కుంచం మానస తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మార్చి 28న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ చిన్న చిన్న కేసులకు తక్షణ పరిష్కారం అందించే వేదికగా నిలుస్తుందని సూచించారు. కోర్టుల చుట్టూ తిరుగుతూ సమయం, డబ్బు వృథా చేసుకునే పరిస్థితి నుంచి బయటపడేందుకు లోక్ అదాలత్ మంచి అవకాశం అని వారు పేర్కొన్నారు. కంపౌండబుల్ కేసులు, సివిల్ తగాదాలు, ఆస్తి విభజన, కుటుంబ వివాదాలు, రోడ్డు ప్రమాదాలు, డ్రంక్ అండ్ డ్రైవ్, టౌన్ న్యూసెన్స్, చెక్ బౌన్స్ కేసులు వంటి వివిధ రాజీ పడదగిన కేసులను ఈ లోక్ అదాలత్ ద్వారా సులభంగా పరిష్కరించుకోవచ్చని తెలిపారు. సంబంధిత పోలీస్ స్టేషన్ లేదా న్యాయస్థానాన్ని సంప్రదించి ఇరువర్గాలు పరస్పరం రాజీకి రావచ్చని అన్నారు. ఇప్పటికే ప్రతి పోలీస్ స్టేషన్‌లో రాజీ పడదగిన కేసులను గుర్తించి, ఇరువర్గాల వారితో కౌన్సిలింగ్ నిర్వహిస్తూ అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. లోక్ అదాలత్ ద్వారా బాధితులకు త్వరితగతిన న్యాయం అందుతుందని, ప్రజలు ఈ అవకాశాన్ని తప్పక వినియోగించుకోవాలని ఎస్ఐ తెలిపారు.
28న జాతీయ లోక్ అదాలత్..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



