నవతెలంగాణ – రాయపోల్ : విద్యార్థులలో నాయకత్వ లక్షణాలు పెంపొందించడానికి స్వయం పరిపాలన దినోత్సవం నిర్వహించడం జరుగుతుందని మండల విద్యాధికారి రాజగోపాల్ రెడ్డి అన్నారు. గురువారం రాయపోల్ మండలం రాంసాగర్ హరిజనవాడ ప్రాథమిక పాఠశాలలో స్వయం పాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా విద్యార్థులు డిఈఓ రిషివర్ధన్, ఎంఈఓ కార్తీక్, ప్రధానోపాధ్యాయులు శ్రీనిత్య, పీఈటీ రేవంత్, ఉపాధ్యాయులు వేదవికాస్, మనోహర్ విధులు నిర్వహించారు.ఈ సందర్భంగా రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల్లో చిన్నప్పటి నుంచే నాయకత్వ లక్షణాలు పెంపొందేలా ఇటువంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరమని తెలిపారు. విద్యార్థులు తమ జీవిత లక్ష్యాలను ముందుగానే నిర్ణయించుకుని వాటి సాధనకు క్రమశిక్షణతో కృషి చేయాలని సూచించారు. పట్టుదలతో చదువుకుంటేనే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని ప్రేరణనిచ్చారు. భవిష్యత్తులో సమాజానికి ఉపయోగపడే బాధ్యత గల పౌరులుగా ఎదగాలని ఆకాంక్షించారు.అనంతరం విద్యార్థులకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు వెంకటేశ్వర్లు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు విల్సన్, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్పర్సన్ కవిత, ఆరేపల్లి ప్రధానోపాధ్యాయులు చంద్రశేఖర్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు పెంపునకు స్వయం పాలన దినోత్సవం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



