Friday, March 27, 2026
E-PAPER
Homeకరీంనగర్వేతనాలు చెల్లించకపోతే ఆందోళన ఉధృతం చేస్తాం..

వేతనాలు చెల్లించకపోతే ఆందోళన ఉధృతం చేస్తాం..

- Advertisement -

– 10 నెలలుగా అందని వేతనాలు ..
– సిద్దిపేట రేంజ్ కార్యాలయం వద్ద బీడీ టెకేదార్ల నిరసన!
నవతెలంగాణ-తంగళ్ళపల్లి : ఠాకూర్ సావదేకర్ బీడీ కార్మికులకు వెంటనే యాజమాన్యం వేతనాలు చెల్లించకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని టేకేదారుల అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు శ్రీరాముల దశరథం హెచ్చరించారు.రాజన్న సిరిసిల్ల జిల్లాలోని బీడీ కార్మికుల కష్టార్జితాన్ని ఠాకూర్ సావదేకర్ కంపెనీల యాజమాన్యాలు ఎగ్గొట్టడాన్ని నిరసిస్తూ బీడీ టెకేదారులు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని రేంజ్ కార్యాలయం ముందు గురువారం టేకేదారులు నిరసన వ్యక్తం చేశారు. గత 10 నెలలుగా రెక్కలు ముక్కలు చేసుకుని బీడీలు చుట్టిన వేలాది మంది కార్మికులకు వేతనాలను యాజమాన్యాలు చెల్లించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మికుల గోడును వినేందుకు సిద్దిపేట రేంజ్ అధికారి కనీసం అందుబాటులో లేకపోవడంపై టేకేదారులు తీవ్రంగా మండిపడ్డారు. “ముందస్తుగా ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చి, మా సమస్యలు చెప్పుకోవడానికి వస్తున్నామని తెలిపినప్పటికీ అధికారి మొహం చాటేయడం అత్యంత దురదృష్టకరం” అని టేకేదారులు ఆవేదన వ్యక్తం చేశారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి కార్మికుల ఆకలి కేకలను పట్టించుకోకపోవడం ఏంటని వారు నిలదీశారు. 10 నెలలుగా వేతనాలు అందక కార్మికులు నానా అవస్థలు పడుతున్నారని తెలిపారు. ఇప్పటికే రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్‌కు, జిల్లా లేబర్ ఆఫీసర్‌కు రాతపూర్వకంగా ఫిర్యాదు చేసినా యంత్రాంగంలో చలనం లేదని వారు విమర్శించారు.తక్షణమే కార్మికుల అకౌంట్లలో డబ్బులు జమ చేసి వారి కుటుంబాలను ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు. యజమాన్యాలు, అధికారులు మొండివైఖరి వీడకపోతే రాబోయే రోజుల్లో పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో తంగళ్ళపల్లి,సిరిసిల్ల కు చెందిన టెకేదారులు పెద్ద సంఖ్యలో పాల్గొని యాజమాన్యాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -