Friday, March 27, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్జిల్లాలో పశువైద్యసేవల బలోపేతానికి ఎంత ఖర్చయినా వెనుకాడేది లేదు..

జిల్లాలో పశువైద్యసేవల బలోపేతానికి ఎంత ఖర్చయినా వెనుకాడేది లేదు..

- Advertisement -

– ప్రతీ ఇంట్లో లాభాల పాడి వెలుగులు నింపడమే ప్రభుత్వ లక్ష్యం లక్ష్యం..
– మెరుగైన వైద్యానికి కావలసిన అన్ని సౌకర్యాల ఏర్పాటు..
– జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్..  
నవతెలంగాణ-సూర్యాపేట కలెక్టరేట్ :  చికిత్స కన్నా నివారణ మేలన్న సామెత అనుసరించి పశువైద్యం ప్రజావైద్యం కన్నా ప్రాముఖ్యమని జిల్లాలో పశువైద్యసేవలు అభినందనీయం అని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ పశువాద్యాధికారులను ప్రశంసించారు.కలెక్టరేట్ సమావేశమందిరంలో నిర్వహించినపశువాద్యాధికారుల సమావేశంలో జిల్లా కలెక్టర్ పాల్గొని మాట్లాడుతూ పశు ఆరోగ్యం, జాతి అభివృద్ధికి కృత్రిమ గర్భధారణ, ఆడదూడల కోసం లింగవిభజన వీర్యం వాడకం, వ్యాధుల నివారణకు టీకాలు మొదలు వినూత్నంగా జంతువులకు అత్యవసర వైద్యంతో పాటు ఆపరేషన్లు విరిగిన కాళ్ళకు రాడ్లు వేయడం, ఆర్థోపెడిక్ సర్జన్ల సహకారంతో కుక్కలకు వెన్నెముక ఆపరేషన్స్ తోపాటు ఈ మధ్య ఆంధ్రాలో కోడి పందాల్లో కాళ్ళు రెక్కలు విరిగి గాయాలైన పందెం కోళ్లకు కూడా మనజిల్లాలో వైద్యం అందించడం సంతోషంగా ఉందన్నారు. నూటికి నూరు శాతం లక్ష్యాలను సాధించిన శాఖ పశుసంవర్ధక శాఖ అని జిల్లాలో మరింత మెరుగైన సేవలతో పశుపోషకుల ఆదాయ మార్గాలను పెంచడానికి కావాల్సిన మౌలిక సదుపాయాలు అవసరాలు తెలియజేయాలని అధికారులకు సూచించారు. జిల్లాలోని అన్ని పశు వైద్యశాలల్లో ప్రజా సమాచారం కోసం పబ్లిక్ అడ్రెస్ సిస్టమ్ ఏర్పాటు, శౌచాలయాల నిర్మాణం, తాగునీటి సౌకర్యం, ఆపరేషన్ పరికరాలకిట్లను అందిస్తామని తెలిపారు. మున్సిపాలిటీ పట్టణాల్లో వ్యాధిసోకిన పశువులను ఆసుపత్రికి తీసుకొచ్చి ఇంటి వద్ద దింపడానికి హైడ్రాలిక్ అంబులెన్స్ల ఏర్పాటుతో పాటు ప్రతీ నియోజక వర్గానికి క్రిటికల్ ఆపరేషన్లకోసం ఆర్థోపెడిక్ సర్జరీ పరికరాల కిట్టు ఏర్పాటు చేస్తామని అన్నారు. జిల్లాలో పశుగ్రాసం కొరత తీవ్రంగా ఉందని పశుగ్రాసం కొరత తీర్చడానికి కావలసినంత పశుగ్రాస విత్తనాలు అందిస్తామని, ఆసక్తి గల సమభావన సంఘాలతో పశుగ్రాసాలు పెంచి జిల్లాలో పశుగ్రాస బ్యాంక్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. కోదాడ లో దాతల సహకారంతో పశు ఔషధ బ్యాంక్ ఏర్పాటుతో అనతికాలంలో పశుపోషకులకు రూ. కోట్ల అదనపు సంపద సృష్టించడం అభినందనీయమని జిల్లాలో ఇదే తరహాలో ఇతర పశువైద్యశాలల్లో పశు ఔషధ బ్యాంక్ ల ఏర్పాటుకు కృషి చేయాలని సూచించారు. జిల్లాలో 55 ఆఫీస్ సబార్డినేట్ పోస్ట్ లు ఖాళీగా ఉన్నాయని అడిగిన జిల్లా అధికారికి ఆ పోస్టు లను అవుట్ సోర్సింగ్ పద్ధతిలో ఇవ్వడానికి ప్రతిపాదనలు పంపించాలని సూచించారు. కోదాడ, చిలుకూరు ఆసుపత్రులకు అల్ట్రా సౌండ్ కలర్ డాప్లర్ స్కానింగ్ యంత్రాలకు నిధులు ఇచ్చామని 50 పశువైద్య శిబిరాలకు కూడా నిధులు ఇవ్వడం జరిగిందన్నారు. ఆసుపత్రుల్లో వైద్యులకు కుర్చీ టేబుల్స్, ఉపాధిహామీలో పశువులకొట్టాల మంజూరీ తక్షణమే ఇవ్వడం జరుగుతుందని పేర్కొన్నారు. సమాజంలో నూటికి 98.7 శాతం ప్రజలు పశు ఉత్పత్తులైన పాలు, మాంసం, గుడ్లు ఆహారంగా తీసుకుంటున్నారని, వారంతా ఆరోగ్యంగా ఉండాలంటే పశువైద్యం పటిష్టంగా ఉండాలని ఇక నుండి ఆకస్మిక తనిఖీలు చేపడుతామని తెలిపారు. అందరూ అంకిత భావంతో పని చేసి పశు ఆరోగ్యంతో పశుపోషకుల ఆదాయం పెంచి జిల్లాకి మంచి పేరు తేవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో జిల్లా పశు వైద్య మరియు పశుసంవ అధికారి డా బి శ్రీనివాసరావు అసిస్టెంట్ డైరెక్టర్ లు డా వెంకన్న డా పి పెంటయ్య , డా సత్యనారాయణ, డా బి వి ప్రసాద్ , పశువైద్యులు పాల్గొన్నారు.

డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో సదుపాయాలు కల్పించాలి..
నెల రోజుల్లో పనులు పూర్తి చేయాలి..

సూర్యాపేట పట్టణంలోని కేసారం వద్ద నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో మౌళిక సదుపాయాలను కల్పించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ సంబందిత కాంట్రాక్టర్ ను ఆదేశించారు.గురువారం సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో రెవెన్యూ, మున్సిపల్, హౌసింగ్ శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. 

ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పట్టణ ప్రజల కోసం నిర్మించిన రెండు పడకల గదుల ఇళ్లలో మౌళిక సదుపాయలు అయిన తాగునీరు, విద్యుత్‌ మొదలైన సదుపాయాలను నెల రోజుల్లో పూర్తిచేయాలని సంబందిత కాంట్రాక్టర్ ఆదేశించారు. వాటర్ ట్యాంక్ లకు కనెక్షన్ల పనులు పూర్తి చేసి నీటిసరఫరా జరిగేలా చూడాలన్నారు.ఈ కార్యక్రమంలో గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ సిద్ధార్థ, సూర్యాపేట మున్సిపల్ కమిషనర్ హనుమంత్ రెడ్డి, గుత్తేదారులు ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -