అతి తక్కువ ధరకు లభ్యం
ఐఐటీ ప్రొఫెసర్ తయారీ
నవతెలంగాణ-మెదక్ ప్రాంతీయ ప్రతినిధి
ప్రస్తుతం గ్యాస్ ధరలతో ఇబ్బంది పడుతున్న పేద, మద్య తరగతి ప్రజలకు అందుబాటులో ఉండేలా సోలార్ కుక్కర్‌ను సంగారెడ్డి జిల్లా కంది మండల పరిధిలో ఉన్న హైదరాబాద్ ఐఐటీ ప్రొఫెసర్ దీపక్ జాన్ మాథ్యు తయారు చేశారు. ఈ సౌర కుక్కర్ అందరికీ అందుబాటులో ఉండేలా కేవలం రూ.500లకే లభించనున్నది. ఈ సందర్భంగా ప్రొఫెసర్ దీపక్ జాన్ మాథ్యు మాట్లాడుతూ.. కుక్కర్ ప్రయోగాత్మక పరిశీలనలో మంచి ఫలితాలు వచ్చాయని తెలిపారు. చుట్టూ మూడు స్టీల్ రేకులు, మధ్యలో నల్లటి టిఫిన్ బాక్సుతో ఉండేలా ఈ సౌర కుక్కర్‌ను తయారుచేసినట్టు చెప్పారు.
బాక్సులోని కింద అరలో ఎసరుతో బియ్యం, పై అరలో కూర తయారీకి అవసరమైన పదార్థాలు వేసి ఎండలో ఉంచితే ఒకరికి వంట తయారవుతుందన్నారు. స్టీల్ రేకులపై రెండు నుంచి మూడు గంటల పాటు ఎండపడితే బాక్స్ 140 డిగ్రీల వరకూ ఉష్ణోగ్రత పెరిగి అన్నం, కూర ఉడుకుతాయని తెలిపారు. ఒక్కరికి సరిపోయేలా తయారు చేసిన ఈ కుక్కర్ తయారీకి రూ.500 ఖర్చయిందని అన్నారు. దీనివల్ల వంట చేసుకునేందుకు గ్యాస్ అవసరం లేకుండా కేవలం సూర్యరశ్మి వల్ల మాత్రమే పనిచేస్తుందని తెలిపారు. త్వరలో 100 నుంచి 150 కుక్కర్లను ఉచితంగా పంపిణీ చేస్తామని తెలిపారు.
అందరికి ఉపయోగపడేలా సోలార్ కుక్కర్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



