- Advertisement -
నవతెలంగాణ-మామడ
నిర్మల్ జిల్లా మామడ మండలంలోని పోలీస్‌స్టేషన్‌లో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో మామడ ఎస్‌ఐ అశోక్ ఓ బాధితుడి నుంచి రూ.20వేలు లంచం తీసుకుంటూ రడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. ఓ చీటింగ్ కేసు విషయంలో కేసు నమోదు కాకుండా ఉండేందుకు రూ.40వేలు లంచం డిమాండ్ చేయగా.. రూ.20వేలు ఇస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. అనంతరం ఆదిలాబాద్ ఏసీబీ డీఎస్పీ మిడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వాధికారులు లంచం అడిగితే ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. ప్రజలు ఏసీబీ అధికారుల సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.
- Advertisement -



