Friday, March 27, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ముప్పనపల్లిలో లో వోల్టేజ్  సమస్య

ముప్పనపల్లిలో లో వోల్టేజ్  సమస్య

- Advertisement -


-వెలగని బుగ్గలు… తిరగని ఫ్యాన్స్…
-ఎత్తుకొని మోటార్లు… ఉక్కపోతతో జనాల అవస్థలు…
-పట్టించుకోని విద్యుత్ అధికారులు….
నవతెలంగాణ కన్నాయిగూడెం

ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలోని ముప్పనపల్లి గ్రామంలో లో వోల్టేజ్ సమస్యతో ప్రజలు సతమతమవుతున్నారు. గ్రామంలోని ఇండ్లల్లో  బుగ్గలు వెలగడం లేవు, ఫ్యాన్లు, కూలర్లు తిరగడం లేవు, ఇంటి అవసరాల కోసం ఉపయోగించే చిన్న మోటార్లు సైతం ఎత్తుకోక నీళ్లు సరిగ్గా రాక ఎక్కడ మోటార్లు రిపేర్లు అవుతాయో అని జనాలు గగ్గోలు పెడుతున్నారు. మార్చి నెలలోనే ఇలా పరిస్థితి ఉంటే వచ్చే వేసవి కాలంలో పరిస్థితి ఏ విధంగా ఉంటుందని జనాలు భయపడుతున్నారు. వేసవి కాలంలో వచ్చే వోల్టేజ్ సమస్యను అధిగమించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేశామని విద్యుత్ అధికారులు చెప్తున్నా  క్షేత్ర స్థాయిలో మాత్రం మాత్రం అమలు కావడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. ప్రధాన రహదారి గుండా ఉన్న విద్యుత్ వినియోగదారులకు సమస్యలు ఉన్నాయని ఏటూరు సబ్ స్టేషన్ అధికారులకు చెప్పినా కూడా చేద్దాం చూద్దాం అనే దాట వేసే దొరణ మాటలు చెప్తున్నట్టు సమాచారం. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -