Friday, March 27, 2026
E-PAPER
Homeతాజా వార్తలుతెలంగాణలో సీఎం బ్రేక్‌ఫాస్ట్ స్కీమ్..

తెలంగాణలో సీఎం బ్రేక్‌ఫాస్ట్ స్కీమ్..

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. విద్యార్థులకు పౌష్టికాహారం అందించే లక్ష్యంతో ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టనున్న ‘ముఖ్యమంత్రి బ్రేక్‌ఫాస్ట్’ పథకానికి సంబంధించిన మెనూను విద్యాశాఖ ఖరారు చేసింది. వచ్చే విద్యా సంవత్సరం (2026-27) నుంచి ఈ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. ఈ పథకం కింద విద్యార్థులకు వారానికి ఆరు రోజుల పాటు వేడివేడిగా, రుచికరమైన అల్పాహారం అందించనున్నారు.


విద్యాశాఖ విడుదల చేసిన మెనూ ప్రకారం.. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని పోషకాలతో కూడిన టిఫిన్లను అందిస్తారు. సోమవారం దోసె-చట్నీ లేదా చపాతీ-కూర, మంగళవారం రెండు మిల్లెట్ ఇడ్లీలు-సాంబారు, బుధవారం రెండు పూరీలు-ఆలూ కుర్మా, గురువారం మళ్లీ రెండు మిల్లెట్ ఇడ్లీలు-సాంబారు అందిస్తారు. ఇక శుక్రవారం మిల్లెట్ ఉప్మా లేదా పొంగల్-చట్నీ, శనివారం రెండు బోండాలు-చట్నీని మెనూలో చేర్చారు. టిఫిన్‌తో పాటు రోజూ విడిచి రోజు పాలు, రాగిజావను (వారానికి మూడు రోజులు పాలు, మూడు రోజులు రాగిజావ) విద్యార్థులకు ఇవ్వనున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -