Friday, March 27, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మిర్యాలలో ఘనంగా శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవం

మిర్యాలలో ఘనంగా శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవం

- Advertisement -

నవతెలంగాణ నూతనకల్: రెండవ భద్రాద్రిగా పిలవబడే మండల పరిధిలోని మిర్యాల గ్రామంలోని శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణ మహోత్సవం శుక్రవారం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా దేవాలయ కమిటీ మాజీ చైర్మన్ కాసా శ్రీనివాస్ యాదవ్ దంపతులు స్వామి వారికి బంగారు పూస్తే వెండి మెట్టెలు వెండి జంజం, నూతన పట్టు వస్త్రాలను తన సొంత ఖర్చులతో ఆలయ కమిటీ సభ్యులకు ప్రధాన అర్చకులకు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భక్తుల కోరిన కోరికలను తీర్చే స్వామివారి కల్యాణ మహోత్సవంలో ప్రశాంత వాతావరణంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనుకోరారు. ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ చైర్మన్ మన్నెం పరమేష్, సర్పంచ్ అలంతుల శ్రీనివాస్ గౌడ్, గ్రామ పెద్దలు దరిపెల్లి వీరన్న, ఇరుగు కిరణ్ కుమార్, గుణగంటి వెంకన్న, వెంకట మల్లు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -