Friday, March 27, 2026
E-PAPER
Homeకరీంనగర్విద్యా వ్యవస్థ గౌరవాన్ని కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత

విద్యా వ్యవస్థ గౌరవాన్ని కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత

- Advertisement -

దానిని దెబ్బతీయడానికి ఎవరికీ హక్కు లేదు.

బీఎస్పీ జిల్లా కార్యదర్శి కె.శంకర్..

నవతెలంగాణ రుద్రంగి: రుద్రంగి మండల కేంద్రంలో బుధవారం జరిగినటువంటి సంఘటనను బహుజన్ సమాజ్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా కార్యదర్శి కట్కూరి శంకర్ అన్నారు. ఆయన గురువారం విలేకరులతో మాట్లాడుతూ.. పాఠశాలలు విద్యను అందించే పవిత్ర స్థలాలు ఇక్కడ ఉపాధ్యాయులు విద్యార్థులకు జ్ఞానం మాత్రమే కాకుండా విలువలు, శీలం, క్రమశిక్షణను బోధించే బాధ్యతను నిర్వర్తిస్తున్నారు. ఇటువంటి పవిత్రమైన విద్యా వాతావరణంలో, కొన్ని సంఘటనలను కారణంగా చూపుతూ పాఠశాలలకు వచ్చి ఉపాధ్యాయులను అవమానించడం, వారిపై ఒత్తిడి తెచ్చి విద్యార్థుల ముందు క్షమాపణ చెప్పించడం తీవ్రంగా ఖండించదగిన చర్య అని అన్నారు.

హనుమాన్ దీక్ష అనేది భక్తి, నియమం, ఆత్మ నియంత్రణకు ప్రతీక. అలాంటి పవిత్రమైన దీక్షలో ఉన్న వారు శాంతి, సహనం, వినయం పాటించాలి గానీ, పాఠశాలల్లోకి వెళ్లి ఉపాధ్యాయుల గౌరవాన్ని దెబ్బతీయడం సరైనది కాదు.ఇది భక్తి పరమైన విలువలకు విరుద్ధంగా ఉంది.విద్యార్థుల ముందు ఉపాధ్యాయులను అవమానించడం వల్ల విద్యార్థుల మనసుల్లో ఉపాధ్యాయుల పట్ల గౌరవం తగ్గే ప్రమాదం ఉంది.దీని వలన విద్యా వ్యవస్థ మొత్తం ప్రభావితమవుతుంది. ఉపాధ్యాయులు గౌరవింపబడాలి, రక్షించబడాలి అవమానింపబడకూడదు.ఏదైనా సమస్య ఉన్నపుడు, దానికి సరైన విధానాలు ఉన్నాయి. పాఠశాల యాజమాన్యం,ఉన్నతాధికారులు లేదా విద్యాశాఖ ద్వారా చర్చించి పరిష్కారం కనుగొనాలి. కానీ బీజేపీ నాయకులు ఇందులో తల దూర్చి రాజకీయం చేయడం సరైనది కాదు  ఈ విధంగా సమూహంగా వచ్చి ఒత్తిడి తేవడం, బెదిరింపులకు పాల్పడడం ప్రజాస్వామ్య పద్ధతులకు విరుద్ధం. అందువల్ల, ఇటువంటి ఘటనలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా సంబంధిత అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాము. విద్యా వ్యవస్థ గౌరవాన్ని కాపాడటం మన అందరి బాధ్యత అని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -