నవతెలంగాణ – జుక్కల్
జుక్కల్ మండల కేంద్రంలోని పలు వార్డులలో వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని గ్రామ సర్పంచ్ నిత్యం ప్రజల వద్దకే వెళ్లి అవిశ్రాంతంగా నీటి సమస్యలను తీర్చడానికి కృషి చేస్తున్నారు.

శుక్రవారం నాడు మండల కేంద్రంలోని ఆరవ వార్డులో తీవ్ర నీటి సమస్య ఉన్నందువలన వెంటనే స్పందించిన గ్రామపంచాయతీ అధికారులు సర్పంచ్ కర్రేవార్ సావిత్ర సాయ గౌడ్ చర్చించి వెంటనే మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ తో కలిసి క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిశీలించారని జిపి కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.
ఇటీవల జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు గ్రామాలలో నీటి ఎద్దడి ఉండకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించడంతో అప్రమత్తమైన జుక్కల్ సర్పంచ్ ఆరో వార్డులో జిపి నిధులతో కొత్త బోరుబావిని వేయించారు. వెంటనే కొత్త మోటారును కొనితెచ్చి నేడు నీటిని పైకి తోడి జిపి అధికారులు, గ్రామస్తులతో కలిసి ప్రారంభించడం జరిగింది. కాలనీవాసులు సర్పంచ్ కు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తో పాటు, జిపి కార్యదర్శి, వార్డు సభ్యులు చంద్రకళ, లక్ష్మణ్, కాలనీవాసులు , గ్రామ పెద్దలు భూమయ్య, జిపి పాలకవర్గం సభ్యులు , తదితరులు పాల్గొన్నారు.



