- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
శ్రీరామనవమి ఉత్సవాలను పురస్కరించుకుని తాడిచెర్ల, ఖమ్మంపల్లి సరిహద్దుల్లోని మానేరు ఒడ్డునున్న చంద్రవెళ్లిలోని శ్రీరామలింగేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవం వేద పండితులచే ఆలయ చైర్మన్ ఇందారపు లక్ష్మీ, వైస్ ఛైర్మన్ చిలుక రాధిక ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ మహోత్సవాన్ని తిలకించడానికి తాడిచెర్ల, ఓడెడ్, ముత్తారం, ఖమ్మంపల్లి, అడవి శ్రీరాంపూర్ తదితర గ్రామాల ప్రజలు, సందర్శకులు అధిక సంఖ్యలో హాజరై సీతారాముల కల్యాణాన్ని తిలకించారు.
- Advertisement -


