Friday, March 27, 2026
E-PAPER
Homeకరీంనగర్మార్చి 31లోపు ఆస్తిపన్ను చెల్లించాలి: కలెక్టర్

మార్చి 31లోపు ఆస్తిపన్ను చెల్లించాలి: కలెక్టర్

- Advertisement -

నవతెలంగాణ – రాయికల్
రాయికల్ మున్సిపల్ పరిధిలో పాత బకాయి ఆస్తి పన్నులను ఈ నెల 31లోపు తప్పనిసరిగా వసూలు చేయాలని జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ అధికారులకు ఆదేశించారు. శుక్రవారం రాయికల్ పట్టణంలోని మున్సిపల్ పన్నుల వసూళ్లపై ఆయన సమీక్ష నిర్వహించారు. పట్టణంలో ఆస్తి పన్ను వసూళ్ల పురోగతిని పరిశీలించిన కలెక్టర్, బకాయిలు ఉన్న యజమానులకు వెంటనే నోటీసులు జారీ చేసి గడువులోపు పన్నులు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

నోటీసులు ఇచ్చినప్పటికీ పన్నులు చెల్లించని వారిపై కఠిన చర్యలు తీసుకుని నీటి కనెక్షన్లు తొలగించాలని స్పష్టం చేశారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మున్సిపల్ పరిధిలో పారిశుధ్యం, మౌలిక సదుపాయాలు, పన్నుల వసూళ్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అన్నారు. పట్టణాభివృద్ధికి ఆస్తి పన్నులు కీలకమని, ప్రజలు స్వచ్ఛందంగా పన్నులు చెల్లించాలని కోరారు. ఈ సమీక్షలో మున్సిపల్ కమిషనర్, కీర్తి నాగరాజు, మున్సిపల్ మేనేజర్ వెంకటి, అశోక్, ఆర్ఐ. దేవదాస్, సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -