నవతెలంగాణ – కట్టంగూర్
శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా మండల కేంద్రంలోని శ్రీ శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి దేవస్థానంలో సీతారాముల కళ్యాణం కన్నుల పండుగగా జరిగింది. స్వామి వారి ఉత్సవమూర్తులకు ముందుగా పంచామృత అభిషేకాలు నిర్వహించి అనంతరం మంగళ స్నానాలు గావించారు. అనంతరం ఎదుర్కోళ్ల ఉత్సవాన్ని నిర్వహించి కళ్యాణ వేదికకు తీసుకొచ్చి సర్వాంగ సుందరంగా అలంకరించి వేదమంత్రోచ్ఛరణలతో కళ్యాణ ఉత్సవాన్ని ఆలయ పూజారి రామడుగు శ్రీనివాసశర్మ వైభవంగా నిర్వహించారు. అనంతరం అన్న ప్రసాద వితరణ చేశారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ ముక్కాముల శ్యామల శేఖర్, ఉప సర్పంచ్ గుండు రాంబాబు, వార్డు సభ్యులు అయితగోని సైదులు, కానుగు శ్రీను, కళ్లెం నాగేశ్వరరావు, పులకరం శీను, ఏకుల సుజాత సైదులు, అయితగోని సైదమ్మ,ముషం మహేష్, ఆలయ కమిటీ సభ్యులు రుద్రాభట్ల జితేంద్రశర్మ, రెడ్డిపల్లి సైదులు, కొంపెల్లి సైదులు,కోమటి భాస్కర్, మీలా వేణుమాధవ్, కాపుగంటి నరేష్, చిక్కు బుచ్చిబాబు, కట్టంగూరు శివ, కొల్లూరు శివప్రసాద్, గోశిక ఉమాపతి,చిక్కుల్ల నరేష్,చెర్కు వెంకన్న,బత్తిని సత్తయ్య, మహేశ్, కడవేరు కృష్ణవేణి, దొరెపళ్లి పద్మ, గుడిపాటి పద్మ, రాపోలు లక్ష్మి, కొత్త శోభ, కొంపెల్లి మంగమ్మ,చేగోని వెంకటమ్మ తదితరులు ఉన్నారు.



