నవతెలంగాణ – మల్హర్ రావు
శ్రీరామనవమి ఉత్సవాలను పురస్కరించుకుని తాడిచెర్లలోని వేంకటేశ్వర స్వామి,పెద్దతూoడ్ల గ్రామంలోని శ్రీహనుమాత్సహిత రాజరాజేశ్వరి,గాదంపల్లిలోని హనుమాన్ సహిత శివపంచాయతన,ఖమ్మంపల్లి-తాడిచెర్ల సరిహద్దుల్లోని మానేరు ఒడ్డునున్న చంద్రవెళ్లిలోని శ్రీరామలింగేశ్వర స్వామి పురాతన ఆలయాల్లో శుక్రవారం శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవం వేడుకలను వేద పండితులచే ఆలయాల కమిటీల ఆధ్వర్యంలో అంగరంగావైభవంగా నిర్వహించారు.
ఈ మహోత్సవాన్ని తిలకించడానికి తాడిచెర్ల,పెద్దతూoడ్ల,మల్లారం,చిన్నతూoడ్ల,ఓడెడ్,ముత్తారం,ఖమ్మంపల్లి, అడవి శ్రీరాంపూర్ తదితర గ్రామాల్లోని సందర్శకులు అధిక సంఖ్యలో హాజరై సీతారాముల కల్యాణమహోత్సవాన్ని తిలకించారు.సందర్శకులకు భోజనాలు, తాగునీరు,తీర్థప్రసాదాలతోపాటు సకల సౌకర్యాలు ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచ్లు బండారి నర్సింగం,బండి స్వామి,మేకల రాజయ్య,మాజీ ఎంపిపి చింతలపల్లి మలహల్ రావు,మాజీ పిఏసిఎస్ చైర్మన్ ఇప్ప మొండయ్య,ఉప సర్పంచ్లు బొబ్బిలి రాజు గౌడ్,తాళ్ల రవిందర్ తోపాటు అన్ని వర్గాల ప్రజలు పాల్గొన్నారు.



