Friday, March 27, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్వైభవంగా సీతారాముల కళ్యాణం..

వైభవంగా సీతారాముల కళ్యాణం..

- Advertisement -

నవతెలంగాణ – ఆలేరు రూరల్ 
ఆలేరు మండలం కొలనుపాకలోని వీరనారాయణ స్వామి ఆలయంలో శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణోత్సవం శుక్రవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయాన్ని పూలతో, తోరణాలతో అందంగా అలంకరించారు. మంత్రోచ్ఛారణల మధ్య శ్రీ సీతారాముల కళ్యాణం భక్తి శ్రద్ధలతో జరిగింది. ఈ కళ్యాణోత్సవంలో గ్రామ సర్పంచ్ బెదరబోయిన యాకమ్మ వెంకటేష్ ముదిరాజ్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమానికి సమీప గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని ఆశీర్వాదాలు పొందారు. కళ్యాణం అనంతరం భక్తులకు అన్న ప్రసాదాన్ని అన్న ప్రసాద వితరణ జరిగింది. భక్తులు శ్రీరామ నామస్మరణతో ఆలయం అంతా మారుమోగింది. కార్యక్రమం భక్తి భావంతో, ఆధ్యాత్మిక ఉత్సాహంతో విజయవంతంగా ముగిసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -